AP Floods : కడప జిల్లాలో 40కి చేరిన మృతుల సంఖ్య

వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఇల్లు కూలిపోయాయి

AP Floods : కడప జిల్లాలో 40కి చేరిన మృతుల సంఖ్య

Ap Floods (2)

AP Floods : ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఇల్లు కూలిపోయాయి. రాష్ట్ర భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదల కారణంగా రోడ్డు, బ్రిడ్జిలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇల్లు నేలమట్టం కావడంతో ఎందరో రోడ్డున పడ్డారు.

చదవండి : AP Floods : వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఇంకా కోలుకో లేదు. కడప జిల్లాలో ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. తిరుమలలో భారీ ఆస్తినష్టం జరిగింది. వరద ఉధృతికి మెట్లమార్గం మొత్తం దెబ్బతింది. పునరుద్ధరణ పనులు పూర్తి కావాలంటే రెండు నెలల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక కపిలతీర్థం వద్ద వందల ఏళ్ల చరిత్ర కలిగిన మండపం దెబ్బతింది. ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడటంతో అక్కడక్కడా రోడ్లు దెబ్బతిన్నాయి.

చదవండి : Rajampeta Floods : రాజంపేట వరద ఘటనలో 26 మంది మృతి..అధికారిక ప్రకటన

ఇక కడప జిల్లాలో మృతుల సంఖ్య 40కి చేరింది. రాజంపేట మండలం పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, గుడ్లూరులో 39 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 24 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 24 మృతదేహాల్లో ఒకటి గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వెల్లడించారు.

చదవండి : Rains And Floods : సీమ జిల్లాల్లో జల విలయంతో ప్రయాణికుల కష్టాలు

ఇక రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా చెట్టుకొకరు బుట్టకొకరులా అయింది పరిస్థితి. ఇప్పటికి పలు గ్రామాలూ నీటిలోనే ఉన్నాయి.