Wedding postponed
Wedding postponed : కేరళలో సెల్ఫీ కారణంగా ఏకంగా పెళ్లి వేడుకనే వాయిదా పడింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్ కు కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9వ తేదీన వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
పెళ్లి వేడుకలో భాగంగా నూతన వధూవరులు కుటుబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వళ్లారు. పూజలు నిర్వహించిన తర్వాత దగ్గర్లో ఉన్న అయిరవల్లి క్వారీని చూసేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో అక్కడ వధూవరులు సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు వధువు శాండ్ర 120 అడుగుల లోతు లోయలో పడిపోయింది.
Groom Postponed Wedding : ఓటు వేసేందుకు ఏకంగా పెళ్లినే వాయిదా వేసుకున్న వరుడు
ఆమెను రక్షించేందుకు వరుడు సైతం లోయలోకి దూకేశాడు. నీటిలో మునిగిపోతున్న శాండ్రాను కాపాడి బండపై కూర్చొబెట్టారు. ఇది గమనించి స్థానికులు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్పగాయాలైన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి వేడుక వాయిదా పడింది.