×
Ad

హైకోర్టుకు ఈడీ.. జనాలతో మమతా బెనర్జీ భారీ ర్యాలీ.. బెంగాల్‌ ఎన్నికల ముందు కీలక పరిణామాలు

కలకత్తా హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌ వేసింది.

Mamata Banerjee (Image Credit To Original Source)

  • నిన్న ఐప్యాక్‌పై ఈడీ దాడులు
  • కోల్‌కతాలో మమత భారీ ర్యాలీ
  • ఈడీ తీరుకు వ్యతిరేకంగా నిరసన

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చైర్‌పర్సన్ మమతా బెనర్జీ ఇవాళ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిన్న ఐప్యాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈడీ తీరుకు వ్యతిరేకంగా మమత ఈ ర్యాలీ నిర్వహించారు.

జాదవ్‌పూర్ 8బీ బస్టాండ్ వద్ద టీఎంసీ నేతలు, కార్యకర్తలు, కోల్‌కతా జనాలు పెద్ద ఎత్తున కనపడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు-మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేస్తుండడం కలకలం రేపింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఐ-ప్యాక్‌ కార్యాలయం, దాని సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌జైన్‌ నివాసంలో దాడులు చేశామని ఈడీ చెబుతోంది.

Also Read: ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలపై రేవంత్ కన్ను.. అది జరగనివ్వం: కేటీఆర్

ఇందులో భాగంగా నిన్న ఐ-ప్యాక్ ఆఫీస్‌, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ ఈడీ దాడులు చేసింది. దాడులు జరుగుతున్న సమయంలోనే ప్రతీక్ జైన్ నివాసం, ఐ-ప్యాక్ ఆఫీసును మమతా బెనర్జీ సందర్శించడంతో దీనిపై ఈడీ, బీజేపీ అభ్యంతరాలు తెలిపాయి.

కలకత్తా హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌ వేసింది. చట్టపరమైన దర్యాప్తును సీఎం వచ్చి అడ్డుకున్నారని తెలిపింది. సీఎంతో కలిసి పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకెళ్లారని పేర్కొంది. దర్యాప్తునకు అడ్డుతగులుతున్న వారిపై పిటిషన్‌ వేసేందుకు కలకత్తా హైకోర్టు అనుమతిని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టడం గమనార్హం.