Mamata Banerjee Election Result: వెస్ట్ బెంగాల్ లో సంచలనం.. మమతా బెనర్జీ ఓటమి
బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో మమత ఓడిపోయారు. 15వేల 114 ఓట్ల తేడాతో మమతపై గెలుపొందారు సువేందు అధికారి.
Mamata Banerjee Election Result: వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కి బిగ్ షాక్ తగిలింది. మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. భవానీపూర్ నుంచి బరిలోకి దిగిన మమత పరాజయం చవిచూశారు. బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో మమత ఓడిపోయారు. 15వేల 114 ఓట్ల తేడాతో మమతపై గెలుపొందారు సువేందు అధికారి.
కౌంటింగ్ ప్రారంభంలో మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉండగా చివరి కొన్ని రౌండ్లలో అధికారి ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. కాగా, పోలింగ్ ఏజెంట్లను మమత అలర్ట్ చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం తమ పార్టీ నుంచి ఎన్నికలను దొంగిలిస్తున్నాయని ఆరోపించారు. 13 రౌండ్లు పూర్తయిన తర్వాత సువెందు అంతరం తగ్గుతూ వచ్చింది.
ఇక బెంగాల్ లో కమలం వికసించింది. 200కు పైగా సీట్లతో ఘన విజయం సాధించింది. అధికార టీఎంసీ 72 స్థానాలకే పరిమితమైంది. మరో 7 స్థానాల్లో ముందంజలో ఉంది. 2021లోనూ మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. మరోసారి టీఎంసీ అధికారంలోకి రావడం ఖాయమని మమతా బెనర్జీ కలలు కన్నారు. కానీ ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఈ రిజల్ట్ ను మమత జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఓటమిపాలవడం భారీ షాక్ అనే చెప్పారు.
