బెంగాల్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూలీ భార్య
దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్ లో అంతగా ఉనికిలోలేని బీజేపీ.. 2021అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ ఇస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో 18 పార్లమెంట్ సీట్లు గెల్చుకొని సత్తా చాటిన కమలం పార్టీ ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణముల్ కి గట్టి పోటీ ఇస్తోంది.

West Bengal Polls Bjps Bankura Face A Daily Wagers Wife
West Bengal Polls దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్ లో అంతగా ఉనికిలేని బీజేపీ.. 2021అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ ఇస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో 18 పార్లమెంట్ సీట్లు గెల్చుకొని సత్తా చాటిన కమలం పార్టీ ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణముల్ కి గట్టి పోటీ ఇస్తోంది. అయితే బెంగాల్ లో అధికారమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకెళ్తున్న బీజేపీ..తాజాగా అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.
అయితే, తాజాగా బంకురా జిల్లాలోని సాల్తోరా నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ఓ కూలీ భార్యను బరిలో నిలిపింది బీజేపీ. 30 ఏళ్ల చందనా బౌరిని సాల్తోరాలో తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మూడు మేకలు.. మూడు ఆవులు.. మట్టిగోడల ఇళ్లు ఇవే ఆమె ఆస్తులు. చందనా భర్త శ్రవణ్ కూలీ. తాపీ పని చేస్తూ.. రోజుకు రూ. 400 సంపాదిస్తుంటారు. అప్పుడప్పుడూ చందన కూడా భర్తతో కలిసి పనికి వెళ్తుంటారు. ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.
మరుగుదొడ్డి వసతి కూడా లేని ఇంట్లో ఉండే చందనా.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గతేడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద మొదటి విడతలో భాగంగా 60వేల రూపాయలు వచ్చాయని..దాంతో రెండు కాంక్రీట్ రూమ్ లు నిర్మించుకున్నట్లు చందనా తెలిపారు.
సాల్తోరా ఎస్సీ రిజర్వుడు స్థానం. గత రెండు దఫాలూ ఇక్కడ తృణమూల్ అభ్యర్థి స్వపన్ బరూయి విజయం సాధించారు. ఈ దఫా ఆ పార్టీ అభ్యర్థిని మార్చింది. సంతోష్ కుమార్ మండల్ అనే నేతను బరిలో దించింది.
కాగా,294స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. మే-2న ఫలితాలు వెలువడతాయి.