విమానంలో ఆ క్షణం ఏం జరిగింది?.. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ మాటల్లో..

విశ్వాస్ మాట్లాడుతూ.. "నేను దేవుడిని నమ్ముతాను.. నాతో ప్రయాణిస్తున్న నా సోదరుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను" అని పేర్కొన్నాడు.

Ahmedabad plane crash

Air India Flight Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం 1.38గంటల సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కేవలం ఒక్క వ్యక్తి మినహా 241 మంది మృతిచెందారు. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడటంతో వారిలో 24మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. విమాన ప్రమాదం నుంచి 40ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. అయితే, విమాన ప్రమాదం జరిగిన సమయంలో భయానక పరిస్థితుల గురించి విశ్వాస్ కుమార్ వెల్లడించారు.

Also Read: Amit Shah: వెయ్యి మందికి డీఎన్ఏ పరీక్షలు, ఆ తర్వాతే..- విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

విశ్వాస్ మాట్లాడుతూ.. “నేను దేవుడిని నమ్ముతాను.. నాతో ప్రయాణిస్తున్న నా సోదరుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నాడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకన్ల తరువాత పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. ఇదంతా కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోయిందని విశ్వాసం చెప్పాడు.

నేను చూసిన దాన్ని నమ్మలేకపోయాను. ప్రమాదం జరిగిన వెంటనే నేను కళ్లు తెరిచి చూడగా.. నా చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. భయంతో నేను లేచి పరుగెత్తడం మొదలుపెట్టాను. నా చుట్టూ విమానం ముక్కలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్సులో ఎక్కించి ఆస్పత్రికి తీసుకొచ్చారు.

నేను 20 సంవత్సరాలుగా లండన్ లో నివసిస్తున్నాను. నా భార్య, బిడ్డ కూడా లండన్ లో నివసిస్తున్నారు. వారు భయపడ్డారు. కానీ ఇప్పుడు నేను బతికే ఉన్నానని వారికి తెలుసునని రమేష్ చెప్పాడు. తన సోదరుడు అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని రమేష్ చెప్పాడు.

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో గుండెలు పిండే విషాదం.. డాక్టర్ ఉద్యోగం వదిలేసి భర్త, పిల్లలతో లండన్‌కు వెళ్తున్న ఫ్యామిలీ దుర్మరణం..

విశ్వాస్ కుమార్ రమేష్ కు 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న విశ్వాస్.. అనూహ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ బ్రిటన్ పౌరుడు. అతడు 20ఏళ్లుగా లండన్ లో నివసిస్తున్నాడు. తని భార్య, పిల్లలు కూడా లండన్ లోనే నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.