Covid-19 : బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటీ ? వ్యాధి లక్షణాలివే..ఎలా వస్తుంది ?

ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. ఇది కొత్త వ్యాధి కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదే. ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు.

Mucormycosis

Black Fungus : ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న కొంతమందికి బ్లాక్ ఫంగస్ వ్యాధి గురవుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒకటో రెండు రోజుల్లో దీనికి సంబంధించి భయపెట్టే వార్తలు ప్రచారం అవుతాయి. కోవిడ్ నుంచి కోలుకొన్నామన్న ఆనందాన్ని కూడా దక్కకుండా, తిరిగి వేలాది మంది ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి అసలు విషయం ఏమిటీ ?

ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. ఇది కొత్త వ్యాధి కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదే. ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు.

వ్యాధి లక్షణాలు :
1. ముఖం లోని కండరాలు తిమ్మిరెక్కడం.
2. కళ్ళు ఎర్రబడడం , ఇంకా కళ్ళు వాపుకి గురికావడం అంటే కను గుడ్డు పెద్దది కావడం.
3. ముక్కులో ఒక్క పక్క మూసికొనిపోయినట్టు ఉండడం.
ఇది ఎంత వరకు ప్రమాదకరం ?

ఇది సోకిన వారిలో సరైన చికిత్స అందని పక్షంలో సగం మంది మరణించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే వ్యాధి సోకిన ముగ్గురిలో ఒకరికి కనుచూపు పోయే ప్రమాదం ఉందని, దవడ ఎముక ముక్కు పోగొట్టుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎలా వ్యాపిస్తుంది ? :
ఈ ఫంగస్ (ఒక రకమైన బూజు) గాలిలో ఉంటుంది. పుట్టగొడుగు కోవకు చెందింది. ఇది ఎప్పటినుంచో ఉండేదే. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సోకుతుంది.

కరోనాకు దీనికి ఏమిటి సంబంధం ? :
ఒక విధంగా చెప్పాలంటే సంబంధం లేదంటున్నారు నిపుణులు. ఇది కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాదంటున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమందికి ఇది సోకుతోంది. ఢిల్లీ అహ్మదాబాద్ , బెంగళూరు లాంటి నగరాల్లో కొంత మంది ఈ వ్యాధి సోకి ఆసుపత్రులకు వస్తున్నారు. వీరందరూ కరోనా నుంచి ఇటీవల కోలుకున్న వారే !