Covid19పై N95, KN95 మాస్క్‌ల ప్రభావం ఎంత? కొత్త అధ్యయనం!
కరోనా వైరస్ భయం ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతోంది. మూడో వేవ్‌లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.

Masks
N95, KN95 Masks: కరోనా వైరస్ భయం ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతోంది. మూడో వేవ్‌లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా నుండి రక్షించడానికి మాస్క్‌లు సమర్థవంతమైన మార్గం అని మరోసారి స్పష్టం అయ్యింది. మెరుగైన నాణ్యమైన N95, KN95 మాస్క్‌లు కరోనా వైరస్‌ని నిరోధించడానికి మంచి మార్గంగా ఓ అధ్యయనం చెబుతోంది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (USCDC) సమాచారం ప్రకారం.. ఈ రెండింట్లో ఏ రకమైన మాస్క్ అయినా కరోనా వైరస్ నుంచి చాలావరకు కాపాడిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. N95, KN95 మాస్క్‌లు కాకుండా, సర్జికల్ మాస్క్‌లు కూడా మెరుగైన రక్షణనే అందజేస్తాయని పరిశోధనా సంస్థ తన వీక్లీ మోర్బిడిటీ నివేదికలో పేర్కొంది.
CDC అంచనాల ప్రకారం, సర్జికల్ మాస్క్‌లు బహిరంగ ప్రదేశాల్లో 66 శాతం కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే N95 మరియు KN95 మాస్క్‌లు కరోనా వచ్చే ప్రమాదాన్ని 83 శాతం తగ్గిస్తాయని చెప్పింది.
అయితే, ఇటీవలికాలంలో ఎక్కువగా గుడ్డ మాస్క్‌లను ధరిస్తుండగా.. క్లాత్ మాస్క్ ధరించడం వల్ల కరోనా వచ్చే అవకాశం 56 శాతం మాత్రమే తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణ ప్రజలలో SARS-CoV-2 సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి ఫేస్ మాస్క్ క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు.