Saif Ali Khan : రాహుల్ గాంధీ.. బ్రేవ్ పొలిటీషియన్.. బాలీవుడ్ స్టార్ ప్రశంసలు..!

Saif Ali Khan - Rahul Gandhi : విమర్శలను కూడా ఆకట్టుకునే విధంగా ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ధైర్యం కలిగిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీని సైఫ్ అలీ ఖాన్ కొనియాడారు.

Bollywood Star Saif Ali Khan On Brave Politician

Saif Ali Khan – Rahul Gandhi : లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఆయనకు విమర్శలేం కొత్త కాదు.. ఎలాంటి విమర్శలైన తిప్పికొట్టగల సమర్థుడు” అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. విమర్శలను కూడా ఆకట్టుకునే విధంగా ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ధైర్యం కలిగిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీని సైఫ్ అలీ ఖాన్ కొనియాడారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లాంటి ధైర్యవంతుడైన నిజాయితీగల రాజకీయవేత్తను తాను ఇష్టపడుతున్నానని చెప్పాడు.

ఈ ముగ్గురు ధైర్యవంతులైన రాజకీయవేత్తలే.. :
ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరకు భారత్‌ను భవిష్యత్తులోకి నడిపించగల ధైర్యం కలిగిన రాజకీయవేత్తగా ఎవరు అనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు అలీఖాన్ వారందరూ ధైర్యవంతమైన రాజకీయ నాయకులనేని అన్నారు. కానీ, ఆ ముగ్గురిలో రాహుల్ గాంధీనే బ్రేవ్ పొలిటీషియన్ అంటూ కితాబిచ్చాడు.

గతంలో తాను ఎదుర్కొన్న అగౌరవ పరిస్థితులను సమర్థవంతంగా తిప్పికొట్టినందుకు రాహుల్ గాంధీని ఆయన ప్రశంసించాడు. “రాహుల్ గాంధీ విధానం చాలా ఆకట్టుకునేలా ఉందని నేను భావిస్తున్నాను. ఆయన మాటలను లేదా చేస్తున్న పనులను ప్రజలు అగౌరవపరిచిన సందర్భం ఉంది. చాలా ఆసక్తికరంగా ఆయన ఆ విమర్శలను తిప్పికొట్టాడని నేను భావిస్తున్నాను” అని అలీఖాన్ పేర్కొన్నాడు.

నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు :
తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని, ఎవరికి మద్దతిస్తానన్న నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం చెప్పలేనని అన్నాడు. “నా ఉద్దేశంలో నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. దేశం చాలా స్పష్టంగా మాట్లాడిందని నేను భావిస్తున్నాను. నేను ఒక విషయంలో సంతోషంగా ఉన్నాను.

భారత్‌లో ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు. “నేను రాజకీయ నాయకుడిని కాదు. నాకు నిజంగా రాజకీయ నాయకుడిని కావాలనుకోలేదు. నాకు బలమైన అభిప్రాయాలు ఉంటే.. నేను ఒకరిగా మారతాను. వాటిని ఆ విధంగా పంచుకుంటాను” అని అలీఖాన్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్.. రాహుల్ గాంధీ తన గురించి ప్రజల అభిప్రాయాలను మార్చిన మాట వాస్తవమే అని అన్నారు. అలీ ఖాన్ చెప్పేది పూర్తిగా నిజమేనన్నారు. రాహుల్ గాంధీ తన కృషి ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చారు” అని ఆమె అన్నారు.

Read Also : తిరుమల పర్యటనను జగన్ ఇందుకే రద్దు చేసుకున్నారా?