Cyclone Asani 2022: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక: అప్రమత్తమైన కేంద్రం

బంగాళఖాతంలో తీవ్ర తుఫాను ముంచుకొస్తుందన్న భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరికల మేరకు కేంద్ర విపత్తునిర్వహణశాఖ అప్రమత్తం అయింది

Cyclone

Cyclone Asani 2022: బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ముంచుకొస్తుందన్న భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరికల మేరకు కేంద్ర విపత్తునిర్వహణశాఖ అప్రమత్తం అయింది. శ్రీలంక నుంచి అండమాన్ నికోబర్ దీవుల వైపు తుఫాను దూసుకొస్తున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. 2022లో మొదటి తుఫానుగా చెప్పబడుతున్న ఈ తుఫానుకు “సైక్లోన్ అసాని”గా నామకరణం చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరప్రాంతంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం అయ్యాయి. తుఫాను దృష్ట్యా అండమాన్ – నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై విపత్తు నిర్వహణ, కేంద్ర బలగాలు మరియు అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సమీక్షలు నిర్వహించారు.

Also read:Indian Oil: రష్యా నుంచి కారుచౌకగా ముడిచమురు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్

తుఫాను కదలికలపై పూర్తి అప్రమత్తంగా ఉంటూ క్రమం తప్పకుండా గమనించాలని అజయ్ భల్లా ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై అండమాన్ – నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తో సంప్రదింపులు జరపాలని ఆయాశాఖల అధికారులకు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరంలో చేపలు పట్టడం, పర్యాటకం, షిప్పింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని అధికారులు ఆదేశించారు. అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు స్టాండ్ బైలో ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించింది.

Also read: CM Jagan : 30.76 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.. పేదలకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ : సీఎం జగన్

గత వారంలో అండమాన్ – నికోబార్ దీవుల వెంబడి దక్షిణ బంగాళఖాతంలోని మధ్య ప్రాంతంలో ఏర్పడిన స్వల్ప అల్పపీడనం (LPA) శనివారం(మార్చి13) నాటికీ బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం (WML)గా మారిందని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం వివరించింది. మార్చి 20 నాటికి అల్పపీడనం ఉదృతమై మరుసటి రోజు తుఫానుగా మారుతుందని.. తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, మార్చి 23 ఉదయం నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంటుంది” అని వాతావరణశాఖ తెలిపింది. ఈ సమయంలో తీరం వెంబడి 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.