2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? : సమాధానం పెట్రోల్ బంక్ లో

ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్లోని పెట్రోల్ బంక్ లకు వెళితే చాలు. అవును ఇది నిజమే.ఆయిల్ ధరలే పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చినా, ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Also: 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? : సమాధానం పెట్రోల్ బంక్ లో
సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్ ధరలు యూపీఏ హయాంలో పెరిగాయి కాబట్టే 2014లో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది.పెట్రో ధరలను పెంచి సామాన్యుడి ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అదే ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూడా ఈ ఐదేళ్లలో ఆయిల్ ధరల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ లానే మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.యూపీఏ పాలన చివరి రెండేళ్లలో ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఎన్డీయే హయాంలో కూడా రెండేళ్లుగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి.
ముంబైలో 2012 మే నెలలో లీటరు పెట్రోల్ ధరరూ.78.57గా ఉంటే 2013 సెప్టెంబర్ లో రూ.8362కు చేరుకుంది. 2014లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే.2017 అక్టోబర్-3న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.99కాగా 2018 అక్టోబర్-4న రికార్డుస్థాయిలో రూ.91.34కు చేరుకుంది. అయితే ప్రస్తుతం లీటర్ ధర రూ. 78 దగ్గర ఉన్నప్పటికీ గత నెలరోజులుగా రీటైల్ ధర పెరుగుతూ ఉంది. ఒకవేళ ఒపెక్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తే రాబోయే నెలల్లో ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది.యూపీతో పోల్చి చూస్తే ఎన్డీయే హయాంలో ఆయిల్ ధరల పెరుగుదలకు రెక్కలు వచ్చాయి. సామాన్యుడికి భారం కాకుండా ఆయిల్ ధరల విషయంలో పాలసీలు తీసుకోవడంలో ఎన్డీయే ప్రభుత్వ ప్రయత్నాలు తక్కువగానే ఉన్నాయి.
2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు 9 సందర్భాల్లో పెట్రోల్,డీజిల్ ధరలపై ఎన్డీయే ప్రభుత్వంఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో 2015 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ కలెక్షన్స్ రూ.99,184 కోట్లు కాగా,2017 ఆర్థిక సంవత్సరంలో రూ.2,42,691కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.2018 ఆర్థికసంవత్సరంలో కూడా ఇంతేస్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 2017 అక్టోబర్ లో,2018 అక్టోబర్ నెలలో రెండుసార్లు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఈ విధంగా ఆయిల్ ధరలతో సామాన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. ప్రజల ఆగ్రహానికి గురికాకముందే ఏ ప్రభుత్వమైన సరైన పాలసీలు తీసుకొని సామాన్యుడికి ఉపశమనం కలిగించాల్సి ఉంటుంది. ఎన్డీయే హయాంలో భారీగా పెరిగిన ఆయిల్ ధరలు ఈ ఎన్నికల్లో ఓటరుపై ప్రభావం చూపే అవకాశముందా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
Read Also: దేశంలోని ముస్లింలందరినీ పాక్ పంపించాలి… సుప్రీంలో పిటిషన్