JDU INDIA Alliance : ఇండియా కూటమితో జేడీయూ ఎందుకు తప్పుకుందంటే? అసలు కారణం ఇదేనంటున్న పార్టీ సీనియర్ నేత

JDU INDIA Alliance : ఇండియా కూటమితో జేడీయూ ఎందుకు తప్పుకుందో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగీ వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి పతనానికి కాంగ్రెస్ పార్టీ కారణమంటూ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధికారికంగా కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుంది.

Why JDU Dropped Out From INDIA Alliance_ Senior Party Leader Explains

JDU INDIA Alliance : బీహార్ రాజకీయాల్లో కొన్నిరోజుల పాటు సాగిన అనిశ్చితి తర్వాత నితీష్ కుమార్ ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధాలను తెంచుకున్నారు. మళ్లీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో ఆయన చేతులు కలిపారు. బీహార్ సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూ పార్టీ మహాకూటమి నుంచి వైదొలగడంతో ఒక్కసారిగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌తో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేకపోవడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు నితీశ్ కుమార్ చెప్పారు.

Read Also : Bihar New Deputy CMs : బీహార్ కొత్త డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా.. వీరిద్దరూ ఎవరంటే?

పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత సంకీర్ణంలో అనుకూలించలేని పరిస్థితుల కారణంగా పదవి నుంచి వైదొలగాలని తనకు సూచనలు అందాయని బీహార్ సీఎం స్పష్టం చేశారు. ఇండియా కూటమి పతనానికి కాంగ్రెస్ పార్టీ కారణమంటూ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధికారికంగా కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుంది. అనంతరం నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో రాష్ట్ర సీఎంగా 9వసారి ప్రమాణంస్వీకారం చేశారు. అయితే, ఇండియా కూటమి నుంచి జేడీయూ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనేదానిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత కేసీ త్యాగి వివరణ ఇచ్చారు.

JDU  INDIA Alliance

మమతాతో కలిసి కాంగ్రెస్ కుట్ర :
సంకీర్ణ నాయకత్వాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కూటమి నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు తృణమూల్‌కు చెందిన మమతా బెనర్జీతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆయన కేసీ త్యాగీ ఆరోపించారు. డిసెంబర్ 19న జరిగిన భారత కూటమి సమావేశంలో కుట్ర ద్వారా మల్లికార్జున్ ఖర్గే పేరును (ప్రధానమంత్రిగా) ప్రతిపాదించారు. కుట్రపూరితంగానే మమతా బెనర్జీని ప్రధానమంత్రిగా ఖర్గే పేరును ప్రతిపాదించారని ఆయన అన్నారు. ఇతర పార్టీలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ తమ గుర్తింపును తెచ్చుకున్నాయని త్యాగి అన్నారు.

సీట్ల పంపకాలకు అడ్డుపడిన కాంగ్రెస్ :
సీట్ల పంపకాల ప్రక్రియకు కాంగ్రెస్‌ అడ్డుపడిందని, మిత్రపక్షాలపై అసమానమైన డిమాండ్‌లతో ఇతర నేతలను అవమానాలకు గురిచేస్తోందని జేడీయూ ఆరోపించింది. కాంగ్రెస్ చర్యలు భారత కూటమి ఐక్యత, సమర్ధతకు హానికరంగా ఉన్నాయని అన్నారు. సీట్ల సర్దుపాటు ప్రక్రియను కాంగ్రెస్ లాగుతూనే ఉందని, సీట్ల పంపకం తక్షణమే జరగాలని మేము చెబుతూనే ఉన్నామని కేసీ త్యాగి చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియా కూటమి వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని త్యాగి విమర్శలు గుప్పించారు.

Read Also : సీఎంగా 9వ సారి నితీశ్ ప్రమాణం.. గతంలోనూ ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా? బిహార్ రాజకీయాల్లో ఏం జరిగింది?

ట్రెండింగ్ వార్తలు