City Killer Asteroid
City Killer Asteroid : భూమిని ఢీకొట్టేందుకు ఒక భారీ గ్రహశకలం వేగంగా దూసుకువస్తోంది. దాదాపు 100 మీటర్ల వెడల్పు గల ఒక శకలం మొదటిసారిగా డిసెంబర్ 22, 2032న భూమిని ఢీకొనే అవకాశం ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం.. 2024 YRA అనేగ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 3.1శాతంగా ఉందని తేల్చింది. గత ఏడాది డిసెంబర్‌లో ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న 2024 YR4 అనే గ్రహశకలాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
“సిటీ కిల్లర్” గా పిలిచే ఈ అంతరిక్ష శిల ఇప్పుడు డిసెంబర్ 22, 2032న మన గ్రహాన్ని ఢీకొనే అవకాశం 1.5 శాతం (67లో 1 శాతం)గా ఉందని అంచనా. గ్రహశకలం మన గ్రహాన్ని ఢీకొట్టే అవకాశం ఒక శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నాసాతో సహా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు దాని గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
నాసా అంచనా ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్రం నుంచి దక్షిణాసియా వరకు ఈ గ్రహశకలం విస్తరించి ఉంది. ఈ ప్రాంతం బొగోటా, కొలంబియా, లాగోస్, నైజీరియా, ముంబై వంటి భారీ జనాభా కేంద్రాల్లో ఉంది.
గ్రహశకలం పరిమాణం ఎంతంటే? :
రాబోయే అంతరిక్ష శకలం చంద్రుడిని ఢీకొనే అవకాశం కూడా చాలా తక్కువనని అంటున్నారు. ఈ గ్రహశకలం 130 అడుగుల నుంచి 300 అడుగుల వెడల్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక పెద్ద కార్యాలయ భవనం పరిమాణంలో ఉంటుంది.
లేదంటే.. అంతరిక్షం నుంచి ఒక అతిపెద్ద పర్వతం భూమిపై పడితే ఎంత విధ్వంసం ఉంటుందో అంతే స్థాయిలో ఉంటుంది. ఆ గ్రహశకలం మన భూమి వాతావరణంలో విడిపోయినా లేదా భూఉపరితలంపై ఒక బిలంను ఢీకొన్నా అది హైడ్రోజన్ బాంబును పోలి ఉంటాయి, తద్వారా ఏదైనా మహానగరాన్ని నాశనం చేసేంతగా వినాశనాన్ని సృష్టించగలదు.
గ్రహశకలం ఢీకొట్టే అవకాశం తగ్గుతోంది :
కానీ, ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ప్రతిరోజూ తగ్గుతున్నాయి. అపోఫిస్ విషయంలో జరిగినట్లుగా ఇది సున్నాకి తగ్గుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. “రాబోయే నెలల నుంచి కొన్ని సంవత్సరాలలో ఏదో ఒక సమయంలో సున్నాకి వెళుతుంది” అని ప్లానెటరీ సొసైటీకి ప్రధాన శాస్త్రవేత్త బ్రూస్ బెట్స్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. అయినప్పటికీ, ఖగోళ శాస్త్రవేత్తలు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.
Here are 70 clones of #asteroid 2024 YR4 that do hit Earth, highlighting the impact risk corridor. There are some big cities along that line: #Bogota, #Lagos, #Mumbai.
— Tony Dunn (@tony873004.bsky.social) February 11, 2025 at 12:38 AM
నాసా, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA), రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వంటి ఇతర అంతరిక్ష సంస్థలతో సమన్వయంతో ఆ గ్రహశకలం మార్గాన్ని గుర్తిస్తోంది.
మార్చి ప్రారంభంలో లేదా మే ప్రారంభంలో అది కంటికి కనిపించనంతగా తగ్గిపోయే ముందు (కక్ష్య 2028లో మళ్ళీ భూమికి దగ్గరగా తీసుకువచ్చే వరకు) ఆ గ్రహశకలం పరిమాణం, గమనం అంచనాలను మరింత చెక్ చేసేందుకు నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగిస్తుంది.
నాసా డేటా ప్రకారం.. :
ఈ గ్రహశకల ప్రమాద ప్రాంతం తూర్పు పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ప్రపంచంలోని 7 అత్యధిక జనాభా కలిగిన నగరాలు ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగోటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్టూమ్ ప్రమాదంలో పడుతున్నాయి.
మీడియా నివేదికల ప్రకారం.. ఈ నగరాల మొత్తం జనాభా 11 కోట్లకు పైగా ఉంది. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ హెచ్చరిక నెట్‌వర్క్‌కు అనుసంధానించిన భూ-ఆధారిత టెలిస్కోప్‌ల నుంచి పరిశీలనలు కొనసాగుతాయని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం ఏప్రిల్ వరకు కనిపిస్తుంది. ఆ తరువాత జూన్ 2028 వరకు చాలా మసకగా మారుతుంది.