City Killer Asteroid : అయ్య బాబోయ్.. భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా హెచ్చరిక!

City Killer Asteroid : 2024 YR4 అనే గ్రహశకలం భూమిని ఢీకొనుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 3.1 శాతం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది.

City Killer Asteroid : అయ్య బాబోయ్.. భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా హెచ్చరిక!

City Killer Asteroid

Updated On : February 21, 2025 / 6:09 PM IST

City Killer Asteroid : సాధారణంగా గ్రహశకలాలు చాలా కాలంగా భూమికి ముప్పుగానే చెబుతున్నారు. ఒక గ్రహశకలం భూమిని ఢీకొంటే.. అది వినాశనానికి కారణమవుతుందని నమ్ముతారు. గతంలోనూ మన గ్రహాన్ని గ్రహశకలం ఢీకొట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కానీ, అది ఎప్పుడూ నిజం కాలేదు. శాస్త్రవేత్తలు ఇప్పుడు భూమిని ఢీకొట్టగల ఒక గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరిక జారీ చేసింది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలానికి 2024 YR4 అని పేరు పెట్టారు. ఇది భూమికి ప్రమాదకరమని చెబుతున్నారు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ 24వ తేదీన ఖాతాల్లో రూ. 2వేలు పడవు.. వెంటనే ఈ 3 పనులు చేయండి!

ఈ గ్రహశకలాన్ని మొదటిసారిగా డిసెంబర్ 27, 2024న ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) పరిశీలించింది. అట్లాస్ ఫోటోను రెండు రోజుల ముందే తీసినట్లు తేలింది. ఆ తరువాత, ఈ గ్రహశకలం గురించి మరింత సమాచారం అందుబాటులోకి వచ్చింది.

ఖగోళ శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలం కక్ష్య గురించి సమాచారాన్ని పొందారు. ఆ తరువాత, ఈ గ్రహశకలం భూమిని కూడా ఢీకొనే అవకాశం ఉందని నాసా హెచ్చరిస్తోంది. డిసెంబర్ 22, 2032న 2024 YR4 అనే గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 3.1 శాతం ఉందని నాసా పేర్కొంది.

భారత్‌లో ఏయే నగరాలకు ప్రమాదం ఉందంటే? :
భారత్‌లో ఒక గ్రహశకలం పడే ప్రాంతాలను నాసా గుర్తించింది. ఈ ప్రాంతాలలో పసిఫిక్, ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అరేబియా సముద్రం, దక్షిణ ఆసియా ఉన్నాయి. ఈ రిస్క్ జోన్‌లో ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగోటా, లాగోస్ వంటి నగరాలు ఉన్నాయి. అయితే, ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీలో ప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ కాలిన్ స్నోడ్‌గ్రాస్, ఆ గ్రహశకలంతో ఎలాంటి ప్రాణహని లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.

గ్రహశకలంతో రిస్క్ ఏంటి? :
ఈ గ్రహశకలం టొరినో ఇంపాక్ట్ హజార్డ్ స్కేల్‌పై 3 రేటింగ్ పొందింది. దీని ప్రకారం.. భూమికి దగ్గరిగా ఢీకొనడం జరగవచ్చు. ప్రమాదాన్ని సూచించే టొరినో స్కేల్ సున్నా నుంచి 10 వరకు ఉంటుంది. సున్నా అంటే ఢీకొనే ప్రమాదం లేదు. అయితే 10 అనే సంఖ్య ఢీకొనడం కచ్చితంగా ఉందని సూచిస్తుంది. 2004లో చర్చనీయాంశమైన అపోఫిస్ గ్రహశకలానికి మాత్రమే అత్యధిక రేటింగ్ ఇచ్చారు. అపోఫిస్‌కు మొదట్లో టొరినో స్కేల్‌లో 4 రేటింగ్ లభించింది.

అయితే, ఆ తర్వాత కనీసం ఒక శతాబ్దం పాటు ఎలాంటి ముప్పు కలిగించని స్థాయికి తగ్గించారు. ఇంగ్లాండ్‌కు చెందిన మరో ప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ గారెత్ కాలిన్స్ మాట్లాడుతూ.. భూమికి దగ్గరగా ఉన్న వస్తువుల పర్యవేక్షణ పెరిగిందని, 2024 YRA గ్రహశకలం వంటి శకలాలను గుర్తించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని అన్నారు. ఆ గ్రహశకలం తన మార్గాన్ని నమ్మకంగా అంచనా వేయాలంటే చాలా కాలం పాటు ట్రాక్ చేయాలని ఆయన అంటున్నారు.

హిరోషిమా అణు బాంబు కన్నా 500 రెట్లు ఎక్కువ శక్తి :
డైనోసార్లను ఢీకొట్టి తుడిచిపెట్టిన ఆ గ్రహశకలం 10కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు ఉందని చెబుతారు. సగటున, ప్రతి కొన్ని వేల సంవత్సరాలకు 100 మీటర్ల వెడల్పు గల గ్రహశకలాలు భూమిని ఢీకొంటాయి. అలాంటి భయానక శకలాలు నగరవ్యాప్తంగా వినాశకరమైనవిగా చెప్పవచ్చు.

భూమిని ఢీకొన్న తర్వాత, ఈ గ్రహశకలం 8 మెగాటన్నుల శక్తిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ శక్తి జపాన్‌లోని హిరోషిమాను నాశనం చేసిన అణు బాంబు కన్నా 500 రెట్లు ఎక్కువ ఉంటుంది.

నాసా (DART) మిషన్, ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్‌వర్క్ ఈ గ్రహశకలం గమనాన్ని పరిశీలించడానికి, దాని కక్ష్యలో అనిశ్చితులను తగ్గించడానికి పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష మిషన్ ప్లానింగ్ అడ్వైజరీ గ్రూప్ ఇప్పటికే అప్రమత్తమైంది.

Read Also : FD Investment : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. మీరు FDలో పెట్టుబడి పెడుతున్నారా? భారీ వడ్డీని అందిస్తున్న 5 బ్యాంకులివే..!

ఆ గ్రహశకలం దిశను మార్చడానికి ఒక ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంది. అదృశ్యమయ్యే ముందు రాబోయే నెలల్లో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని మరింత వివరంగా అర్థం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శాస్త్రవేత్తల లెక్కలు 2032లో ఈ గ్రహశకలం ఢీకొనే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. ఈ గ్రహశకలం 2028లో మళ్ళీ కనిపించే వరకు అంతరిక్ష సంస్థల ముప్పు జాబితాలో ఉంటుంది. ఆ గ్రహశకలం పరిమాణాన్ని బట్టి చూస్తే ఎప్పటికైనా భూమికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడుతున్నారు.