Indian Currency : రూ.2000 నోటుపై నల్లటి గీతలు.. ఇవి ఎందుకోసమో ఎప్పుడైనా ఆలోచించారా..?

దేశంలో అన్ని కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. భద్రత విషయంలో రాజీపడకుండా ప్రతి నోటుకి అనేక రకాల భద్రతా మార్కులను నోట్లపై వేస్తుంది.

Indian Currency : దేశంలో అన్ని కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. భద్రత విషయంలో రాజీపడకుండా ప్రతి నోటుకి అనేక రకాల భద్రతా మార్కులను నోట్లపై వేస్తుంది. ఈ ఫీచర్ల ద్వారానే ఆ నోట్ నిజమైనదా లేదా నకిలీదా గుర్తించవచ్చు. నోటులో ఉండే చిన్న చిన్న గుర్తులు ఫేక్ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడతాయి. 2016 తర్వాత కరెన్సీ ముద్రణలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు 100, 500, 2000 నోట్లపై నల్లటి గీతలు కనిపిస్తున్నాయి. ఈ గీతలు ఎందుకు ఉంటాయో చాలామందికి తెలియదు.

చదవండి : Fake Currency : దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ

ఇవి ముద్రించడానికి ఓ కారణం ఉంది. అంధులు కరెన్సీ నోటును గుర్తించడం కష్టంగా ఉంటుంది. వారిని దృష్టిలో ఉంచుకొని నోట్లపై నల్లటి గీతలు ముద్రిస్తున్నారు. నల్లటి గీతలను తాకినప్పుడు స్పర్శ కలుగుతుంది. ఈ స్పర్శ ద్వారా అంధులు ఆ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముద్రించే 100 నోటు మీద నాలుగు గీతలు (|| ||) ఉంటాయి. అదే 200 నోటు మీద నాలుగు గీతలు, రెండు చుక్కలు (|| o o ||) ఉంటాయి. ఇక 500 నోటు మీద 5 గీతలు (|| | ||) ఉంటే, 2000 నోటు మీద 7 గీతలు (| || | || |) ఉంటాయి. ఈ నల్లటి గీతలను చేతితో తాకి అది ఎన్ని రూపాయల నోటో గుర్తించవచ్చు.

చదవండి : El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్‌ తయారీ ఘనత

ట్రెండింగ్ వార్తలు