మోడీని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీకి బెదిరింపు కాల్

Kharge ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్‌ ఖర్గే విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలు చేసిన అనంతరం తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందుకు విమర్శిస్తున్నారు? అని అవతలి వ్యక్తి ఖర్గేని నిలదీసినట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆ బెదిరింపు కాల్‌పై ఖర్గే పోలీసులకు ఏం ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

ప్రధాని ప్రసంగం అనంతరం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలను ప్రధాని ఏమాత్రం ఖాతరు చేయలేదని విమర్శించారు. రైతులు, గ్రాడ్యుయేట్లు, సైంటిస్టుల ఆందోళనలను కూడా ప్రధాని పెడచెవిన పెట్టారని అన్నారు. మమ్మల్ని ఫూల్స్ అనుకుంటున్నారా? అంటూ పరోక్షంగా ప్రధానిపై ఖర్గే మండిపడ్డారు.