Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య

భార్య తన భర్తను ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టేదంటే..తప్పించుకునేందుకు అతను ఇంట్లోనే అటుఇటు పరుగులు తీశాడు.

Wife

Wife attack Husband: మహిళలపై గృహహింస కేసులు తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఓ భర్త తన భార్యపై గృహ హింస కేసు పెట్టడం రాజస్థాన్ లో సంచలనంగా మారింది. అదికూడా సీసీటీవీ ఫుటేజిలతో సహా బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన భర్తను ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టేదంటే..తప్పించుకునేందుకు అతను ఇంట్లోనే అటుఇటు పరుగులు తీశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..అల్వార్ లోని భివాడికి చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ అజిత్ యాదవ్‌కు తొమ్మిదేళ్ల క్రితం సుమన్‌ అనే మహిళతో వివాహమైంది. వివాహం అయిన నాటి నుంచి తరచూ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే తన భార్యపై ఎన్నడూ తిరగబడలేదు అజిత్.

Other Stories:Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!

దీంతో భర్త మంచితన్నాని అలుసుగా తీసుకున్న భార్య సుమన్..రోజూ అతనితో గొడవ పెట్టుకునేది. ఈక్రమంలో తరచూ అతన్ని కొట్టడం ప్రారంభించింది. అయితే భార్య తీరుతో విసిగిపోయిన అజిత్..ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాను అమర్చాడు. అప్పుడప్పుడు ఆమె తనపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు భార్య చేసిన అకృత్యాలన్నీ పోలీసులకు చెప్పాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు..బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. కన్న కొడుకు ఎదుటే సదరు మహిళ భర్తపై దాడి చేయడం గమనార్హం. తండ్రిని కొడుతుండగా ఆ బాలుడు కూడా భయపడడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో వాంగ్మూలం కోసం భార్యను పిలిచినా ఇంతవరకు రాలేదు.