Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!

ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకులు ప్రయాణిస్తూ..నడి రోడ్డులో ట్రాఫిక్ మధ్యలో హల్ చల్ చేసిన ఘటన ఇటీవల ముంబై నగరంలో చోటుచేసుకుంది

Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!

Scooter

Six on Scooter: రోడ్లపై వాహనదారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నా..పక్కనే ఉండే కొందరు వాహనదారులతో ప్రమాదం పొంచివుంటుంది. అందుకే పోలీసులు రహదారి నియమాల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తుంటారు. కాగా, ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకులు ప్రయాణిస్తూ..నడి రోడ్డులో ట్రాఫిక్ మధ్యలో హల్ చల్ చేసిన ఘటన ఇటీవల ముంబై నగరంలో చోటుచేసుకుంది. వీరి కారణంగా ఎటువంటి ప్రమాదం సంభవించనప్పటికీ పక్కన వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆరుగురు యువకులు ఒకే స్కూటర్ పై ప్రయాణిస్తూ యదేశ్చగా ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించారు. స్కూటర్ పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అంధేరి వెస్ట్ లోని స్టార్ బజార్ సమీపంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న రమణ్ దీప్ సింగ్ హోరా అనే మరో వాహనదారుడు ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. వీడియోలో..ఒకే స్కూటర్ పై ఒకరిపై ఒకరు ఎక్కి కూర్చున్నారు యువకులు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొంతసేపు హల్ చల్ చేశారు. అనంతరం సిగ్నల్ పడగానే యువకులు ముందుకువెళ్లిపోయారు. ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అంధేరి వెస్ట్ లో ఈ దృశ్యం కంటపడింది. వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రమణ్ దీప్ సింగ్ హోరా..ముంబై ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు.

Other Stories:Attack On Couple: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి

ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించి, లొకేషన్ గురించి ఆరా తీశారు. అనంతరం రంగంలోకి దిగిన అంధేరి వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుల వేటలో ఉన్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహంవ వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చాలా మంది ఎత్తి చూపగా, ఇలాంటి అల్లరి మూకలు బైకులు, స్కూటర్లపై స్టంట్లు లాగడం ప్రతి నగరంలో సర్వసాధారణమైందంటూ మరికొందరు కామెంట్ చేశారు.