Odisha : ఫుట్ బాల్ ఆడిన ఎలుగుబంటి..చివరిలో

 మీరే బంతాట ఆడుతారా ? మేము ఆడుతాం అంటున్నాయి ఎలుగుబంట్లు. ఫుట్ బాల్ బంతితో సరదగా ఆడుకున్నాయి అవి.

Wild Bears Playing Football In Odisha

Wild Bears Playing : మీరే బంతాట ఆడుతారా ? మేము ఆడుతాం అంటున్నాయి ఎలుగుబంట్లు. ఫుట్ బాల్ బంతితో సరదగా ఆడుకున్నాయి అవి. అచ్చం మనిషి ఎలా చేస్తాడో..అలాగే ఆడుకున్నాయి. వెనక్కి, ముందుకు తన్నడం, అటూ ఇటూ పరుగెత్తడం లాంటివి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వావ్ అంటున్నారు నెటిజన్లు. వీరి ఆటకు ఎవరైనా అభిమానులు కావాల్సిందే అంటున్నారు కొంతమంది.

Read More : Oscar Fernandes : కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

నవరంగ్ పూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి మృతిమా పంచాయతీ శుఖిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అడవిలాగా ఉన్న ప్రాంతంలో..రెండు ఎలుగుబంట్లు అక్కడున్నాయి. వాటి వద్దకు ఫుట్ బాల్ ఎలా వచ్చిందో తెలియదు. దానితో ఆడుకుంటూ..ఫుల్ ఎంజాయ్ చేశాయి. ఓ ఎలుగుబంటి అమాంతం ఫుట్ బాల్ ను పైకి లేవట్టి..కింద పడేసింది. అనంతరం దానిని నోటిలో పట్టుకుని..ముందుకు నెట్టింది. అక్కడనే ఉన్న మరో ఎలుగుబంటి దీనిని చూసి వెనక్కి వెళ్లిపోయింది. ఇలా ఆ ఎలుగుబంటి..ముందుకు వె వెనక్కి బంతిని నెడుతూ ఫుల్ గా ఆడేసింది.

Read More : Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

మరో ఎలుగుబంటి రావడానికి ప్రయత్నించినా…ఎందుకో భయపడింది. కానీ..చివరిలో మాత్రం బంతిని నోట్లో పట్టుకుని..గిరా, గిరా తిప్పుతూ..పట్టుకుని పరగులు తీసింది. దాని వెనుకాలో మరో ఎలుగుబంటి పరుగెత్తింది. దీన్నంతా..అక్కడనే ఉన్న వారు వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎలుగుబంటి ఫుట్ బాల్ ఆటకు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.