గబ్బర్ సింగ్ ట్యాక్స్ రద్దు చేస్తాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ స్థానంలో సరళతరమైన జీఎస్టీని అమలు చేస్తామని మంగళవారం (మార్చి-20,2019) అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో రాహుల్ చెప్పారు. వాయుసేన మెరుపు దాడులను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని రాహుల్ ఆరోపించారు.
Read Also : అందంగా కన్పించేందుకు : మాయా రోజూ ఫేసియల్ చేయించుకుంటది

అంతకుముందు బెంగళూరులో ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు నిరసనకారులు రాహుల్ గోబ్యాక్ అనడంతో అలజడి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడరని ఆరోపించింది.

 

ట్రెండింగ్ వార్తలు