కరోనా వైరస్ నుంచి భారత్ తప్పించుకుందా?

  • Publish Date - February 28, 2020 / 01:23 PM IST

నోవల్ కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచమంతా కమ్మేస్తోంది. యూరోప్‌లోనూ మరణాలు నమోదువుతుంటే, అమెరికా కొత్త వైరస్‌ను ఎదుర్కోవడానికి రెడీ. ఎక్కడోఉన్న అమెరికా బెదురుతుంటే, ఇండియా మాత్రం ఎలా సేఫ్ అయ్యింది?నిజానికి జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం ముందుగానే తేరుకొని, చైనా నుంచి ప్రయాణీకులను అడ్డుకుంది. అక్కడన్న మనోళ్లను తీసుకొచ్చేసింది. ముందస్తు జాగ్రత్తలు బాగానే ఉన్నాయి. కాకపోతే, జనసాంద్రత ఎక్కువ, అస్తవ్యస్తమైన ఆరోగ్యవ్యవస్థను చూస్తుంటే ఎక్కడో మూల భయం. ఇప్పుడు ఇండియా కరోనా రిస్క్ జోన్ లోనే ఉంది.

ఇప్పటిదాకా 23,531 మందిని  అబ్జర్వేషన్ ఉంచింది. మూడు కేసుల్లో మాత్రమే పాజిటీవ్ వచ్చింది. ఇంత పెద్ద దేశంలో అందులోనూ చైనాతో సరిహద్ధున్న భారతదేశం కరోనా బారి నుంచి తప్పించుకొంటుందంటే సంతేషమే. పక్కనున్న శ్రీలంకలో  కేసు నముదైంది. పాకిస్థాన్ ఈ వారమే కరోనా పేషెంట్స్‌ను బైటపెట్టింది. ఇద్దరు వేర్వేరుగా ఇరాన్ నుంచి వచ్చారు. వాళ్లకు కరోనా లక్షణాలున్నాయి.

130కోట్లమంది జనాభాతో పోలిస్తే మన కరోనా పేషెంట్ల చాలా తక్కువ. ఈలోగా చైనాలో కట్టడవుతున్నట్లుగా కనిపిస్తున్న కరోనా, చుట్టుప్రక్కల ప్రాంతాలకు మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలోనూ కేసు బైటపడిందంటే భయపడాల్సిందే. ఈ రోగికి చైనాతో ఎలాంటి సంబధమూలేదు. చైనాకు వెళ్లివచ్చినవాళ్లెవరూ అతనికి తెలియదు.

ఇలాంటి కేసులేకనుక ఇండియాలో భయపడితే? ఇక్కడ సమస్య జనాభా కాదు… జనసాంద్రత. చదరపు కిలోమీటర్‌కు 420 మంది జీవిస్తున్నారు. చైనాతో పోలిస్తే మూడింతలు. అక్కడ చదరపు కిలోమీటర్‌కు 148మందే.  ఇక ముంబై, కోల్‌కత్తా, హైదరాబద్ లాంటి మహానగరాల జనాభా కోటిని దాటింది. అక్కడ మురికివాడలూ ఎక్కువే. ఉదాహరణకు ధారవిలాంటి చోట కరోనా వ్యాపిస్తే? ఇండియా భయం అదే.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు కరోనాను అడ్డుకోవడానికి ఎంట్రీపాయింట్లదగ్గర వేలాదిమందిని స్క్రీనింగ్ చేస్తున్నారు. అదృష్టం కొద్దీ ఆగ్రేయాలసియా దేశాల్లో కరోనా ప్రమాదం తక్కుిద. మనకన్నా ఆర్దికంగా ముందున్న దేశాలు మాత్రం కరోనాకు చిక్కాయి. ఇరాన్, అరబ్ దేశాల్లో కనీసం 245 కేసులు బైటపడగా, 26 మంది చనిపోయారు. అందుకే చైనా, జపాన్, కొరియాలకు విమనసర్వీసులను ఆపేసిన పాక్, ఇరాన్‌తో సరిహద్ధులను మూసేసింది.

చైనా నుంచి సొంత విద్యార్ధులను ఇండియా దైర్యంగా తీసుకొస్తే, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు మాత్రం తమ విద్యార్ధులను తరలించడానికి భయపడ్డాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ 312 మంది తమ జాతీయులను వుహాన్ నుంచి రప్పించుకొంది. ఢాకాలో 14రోజులపాటు దూరంగా ఉంచి వైద్యం చేయించింది.

చైనా, భారతదేశాల మధ్య ఓ పోలికుంది. ప్రజలు అవకాశాలను వెతుక్కొంటూ ఒకటిచోట నుంచి మరోచోటకి వలసపోతుంటారు. భారతదేశంలో 45 కోట్ల మంది ఒకచోట నుంచి మరోచోటకెళ్లారు. 2011 జనభాలెక్కలు చెప్పిన సత్యమిది. అంతెందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ప్రతిరోజూ లక్షలాదిమంది వస్తుంటారు…వెళ్తుంటారు. ఒకవేళ కరోనాలాంటి వైరస్ వ్యాపిస్తున్నప్పుడు Hubeiనగరాన్ని దిగ్బంధించినట్లు ఇక్కడ చేయడం చాలా కష్టం. ప్రయాణాలు ఎక్కువ కాబట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది.

కరోనా భయంలో అల్లల్లాడిన మార్కెట్ నిజంగా వ్యాపిస్తేకనుక కుప్పకూలిపోవచ్చన్న భయం చాలామందిది. చైనా అర్ధికవ్యవస్థలో భారత్‌ది మూడోవంతు. అసలు ఆర్ధికమాంద్యభయం. దానికితోడు ఆరోగ్యంమీద శ్రద్ధతక్కువ. మొత్తం జీడీపీలో 3.7శాతం మాత్రమే ఖర్చుచేస్తాం. జనాభాతగినట్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లేవ్. ప్రైవేట్ వైద్యం చాలా ఖర్చు. అయినాసరే, కేంద్రఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ కరోను కట్టడిచేయడంలో గొప్పగా పనిచేశామని, గర్వంగా ఫీలయ్యారు. కరోనా సోకగానే విమానయానసర్వీసులను నిలిపేశారు. చైనా నుంచి విద్యార్ధులను తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌‌ల దగ్గర థర్మల్ స్క్రీనింగ్‌ను ఎర్పాటుచేశారు. కరోనాసోకింది ముగ్గురికి. వాళ్లంతా కేరళవాళ్లే. వాళ్లకూ నయమైంది. డిస్చార్జ్ చేశారు.

పాక్, బంగ్లాదేశ్ తో పాటు భారత్ కు వాతావరణం గొప్పమేలు చేసింది. కరోనా వైరస్ చల్లని ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. ఫ్లూలు వచ్చేది శీతాకాలమే. భారత ఉపఖండంలో ఇప్పటికే వేసవి వేడి కనిపిస్తోంది. ఈ వాతావరణంలో వైరస్ బతికడం కష్టం. అలాగని  ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడంలేదు. మాస్కులు, కరోనాట్రీట్ మెంట్ కు కావాల్సిన మందులను సిద్ధంచేసే ఉంచింది.  దేశ ఆరోగ్యవవస్థకు మలేరియా, డెంగ్యూ, టీబీలను తట్టుకొనే శక్తి ఉంది. కరోనా అంటే చాలా కష్టం. సింగపూర్ నుంచి జపాన్, ఇటలీ వరకు ఆరోగ్యవ్యవస్థలు గొప్పగా ఉన్నదేశాలే కరోనాను తట్టుకోలేకపోతున్నాయి. మరి భారతదేశం పరిస్థితి ఏంటి?