EWS Quota : నీట్- పీజీ కౌన్సెలింగ్ వాయిదా..ఈడబ్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై కేంద్రం పునఃసమీక్ష
నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని
- venkaiahnaidu
- Published On : November 25, 2021 / 05:17 PM IST
Sc (1)
EWS Quota నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
నీట్ ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థుల వార్షికాదాయం క్రైటీరియాను నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు వారాల సమయం అవసరమని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై ప్యానెల్ నివేదిక వచ్చే వరకు నాలుగు వారాలపాటు నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీంతో నీట్-పీజీ కోర్సుల్లో EWS/OBC కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జనవరి 6కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ALSO READ CM Jagan : వైద్య రంగంలో 60వేల పోస్టులు భర్తీ, సీఎం జగన్ కీలక ప్రకటన
