CM Jagan : వైద్య రంగంలో 60వేల పోస్టులు భర్తీ, సీఎం జగన్ కీలక ప్రకటన

9వేల 712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని, 11 వేల పోస్టులను భర్తీ చేసామన్నారు. మరో 14,786 పోస్టులు ఫిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య రంగంలో 60వేల పోస్టులు

10TV Telugu News

CM Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో ఆసుపత్రులు ఎలా ఉన్నాయో? ఇప్పుడెలా ఉన్నాయో? చూడాలన్నారు. మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనది అన్నారు. రెండున్నరేళ్లలో చిత్తశుద్ధితో అడుగులు వేశామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలకు పెంచామన్నారు. రాష్ట్రంలో 90శాతం మందికి ఆరోగ్యశ్రీ కింద వైద్య సాయం అందుతోందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు వెళ్లినా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తున్నామని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి అనేదానిపై గత ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Red Wine : రెడ్ వైన్ మహిళల్లో మధుమేహం రాకుండా చేస్తుందా?

రెండున్నర లక్ష దాటగానే వైద్యం ఆపేసే రోజులు గతంలో ఉండేవని, ప్రస్తుతం రూ.5 లక్షలు దాటినా వైద్యం అందిస్తున్నామన్నారు. మనిషికి ఎంత కావాల్సి వస్తే అంత వైద్యం అందిస్తున్నామని, ఎక్కడా కత్తిరింపులు అనేవే లేవని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ అనేది ఒక విప్లవం అన్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి రూ.4 వేల కోట్లు చెల్లించామన్నారు. గత ప్రభుత్వ బిల్లులు మనమే చెల్లించాము అన్నారు. 1059 వైద్య సేవలుండే ఆరోగ్యశ్రీని 2500 కుపైగా వైద్య సేవలను పెంచి వైద్యం అందిస్తున్నామన్నారు. ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం అన్నారు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రిభోజనం ఎందుకంటే?

గతంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉండేవని, ప్రస్తుతం మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ రానున్నాయని జగన్ చెప్పారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టబోతున్నామన్నారు. గ్రామ స్ధాయి నుంచి వైఎస్ఆర్ విలేజ్ కు శ్రీకారం చుట్టామన్నారు. నాడు-నేడు ద్వారా అన్ని హాస్పిటల్స్ ను 16వేల 250 కోట్లతో అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. 9వేల 712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని, 11 వేల పోస్టులను భర్తీ చేసామన్నారు. మరో 14,786 పోస్టులు ఫిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య రంగంలో 60వేల పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు జగన్ ప్రకటించారు. గతంలో డాక్టర్లు లేక హాస్పిటల్స్ లో దారుణమైన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి దుస్థితి లేదన్నారు సీఎం జగన్.