Red Wine : రెడ్ వైన్ మహిళల్లో మధుమేహం రాకుండా చేస్తుందా?

మితమైన వైన్ వినియోగం పెద్దప్రేగు, బేసల్ సెల్, అండాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

10TV Telugu News

Red Wine : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని వైద్యులు చెబుతుంటారు. మద్యం సేవించటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని దాని జోలికి మాత్రం వెళ్ళవద్దని హెచ్చకలు చేస్తుంటారు. వాస్తవానికి రోజుకు ఒక గ్లాస్ వైన్ తాగితే మంచిదేన‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లతోపాటు , వైద్యనిపుణులు చెబుతున్నారు. ముదురు రంగు, మొత్తం ద్రాక్షను జ్యూస్ గా చేసి పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారు చేస్తారు..దీనిని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగ‌డం వ‌ల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌ల్ని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. క్యాన్స‌ర్‌ల‌ను క‌ల‌గ‌జేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను యాంటీ ఆక్సిడెంట్లు నాశ‌నం చేస్తాయి. దీంతో క్యాన్స‌ర్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారు రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగ‌వ‌చ్చు. దీంతో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. తక్కువ మోతాదులో వైన్ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు దూరమయ్యే అవకాశాలున్నాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఆమ్ల జనకాలు రెడ్ వైన్‌లో ఎక్కువగా ఉంటాయి. దీన్ని మోతాదులో తీసుకుంటే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని చెబుతున్నారు.

వైన్ తాగడం వల్ల శరీర అధిక బరువు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే రోజూ రెడ్ వైన్ తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. దీంతోపాటు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. ఈ క్ర‌మంలో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌నుక రెడ్ వైన్ తాగ‌డం మంచిది. యవ్వనంగా, అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాంటివారు రోజూకి కాస్తా వైన్ పుచ్చుకుంటే యంగ్ గా కనిపిస్తారట.

రెడ్ వైన్‌లో రెస్వెట్రాల్ ఉంటుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను దరికి చేరనివ్వదు. ఇందులోని కొన్ని గుణాలు గుండె సమస్యలను దూరం చేస్తుంది. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నం మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. మెద‌డు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు ఉన్న‌వారు ఆ వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ద్రాక్షలో అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో రెస్వెరాట్రాల్, కాటెచిన్, ఎపికెటెచిన్ మరియు ప్రోఅంటోసైనిడిన్స్ ఉన్నాయి. ప్రోఆంటోసైనిడిన్స్ శరీరంలో ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించవచ్చు. అవి గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌ని నివారించడానికి కూడా సహాయపడతాయి. రెడ్‌వైన్‌లో పిసియాటానోల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌రీర బ‌రువును త‌గ్గిస్తుంది. క‌నుక రెడ్ వైన్‌ను తాగుతుంటే బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజూ రెడ్ వైన్ తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న కూడా త‌గ్గుతాయి.

వృద్ధుల మాదిరిగానే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభా మితమైన వైన్ వినియోగం నుండి మరింత ప్రయోజనం పొందవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు 1–3 గ్లాసుల రెడ్ వైన్ తాగడం, వారంలో 3-4 రోజులు, మధ్య వయస్కులైన పురుషులలో స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రోజుకు 2-3 గ్లాసుల డీల్‌కోహలైజ్డ్ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

మితమైన వైన్ వినియోగం పెద్దప్రేగు, బేసల్ సెల్, అండాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 1–3 గ్లాసుల వైన్ తాగడం వల్ల చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మితమైన రెడ్ వైన్ వినియోగం మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పూర్వకాలంలో ఈజిప్టియన్లు వైన్‌ను చాలా సమస్యలకు ఔషధంగా ఉపయోగించేవారు. దాదాపు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరంలో వైన్‌ని తాగేవారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే రెడ్ వైన్ ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ రోజుకు ఒక గ్లాస్ మించ‌రాదు. అధికంగా సేవిస్తే ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా.. సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. క‌నుక మోతాదులో తీసుకుంటే లాభాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ కొద్దిమొత్తంలో వైన్‌ తాగడం వలన పలు రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చని నిపుణుల పరిశోధనలు సూచిస్తున్నాయి.

ప్రతిరోజూ ఆల్కహాల్ అతిగా తీసుకుంటే ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సిర్రోసిస్ అని పిలువబడే చివరి దశ కాలేయ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ వైన్ తాగడం వల్ల పురుషుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక ఆల్కహాల్ తీసుకోవడం కూడా అకాల మరణానికి దారితీస్తుంది. అతి ఎప్పటీ ప్రమాదమేనన్న విషయం మర్చిపోవద్దు.