Corona Virus
Third Wave: ఇండియాలో థర్డ్ వేవ్ రావడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీసెంట్ స్టడీలో తేలింది. ‘ఆ స్టడీలో థర్డ్ వేవ్ రావడం కాస్త ఆలస్యమవుతుందని తెలిసింది. ఈ మధ్య ఉన్న 6-8నెలల గ్యాప్ లో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీతో రెడీగా ఉండాలి. రాబోయే రోజుల్లో రోజుకు కనీసం కోటి డోసులు వేసేలా ఏర్పాట్లు ఉండాలి’ అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్కే అరోరా అంటున్నారు.
Zydus Cadila vaccine దాదాపు రెడీ అయిపోయింది. జూలై చివరి నాటికి లేదా ఆగష్టు కల్లా ట్రయల్ పూర్తవుతుంది. 12-18 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ కోసం ఆథరైజేషన్ ఇచ్చే అవకాశముంది.
కొవిడ్-19 వ్యాక్సిన్ పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం ఒక మైలురాయి లాంటిదని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా చెబుతున్నారు. భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ 2 నుంచి 18 సంవత్సరాల పిల్లలపై ప్రయోగించడానికి ఫేజ్ 2, 3ట్రయల్స్ సెప్టెంబర్ నాటికి ముగుస్తాయి. డ్రగ్ రెగ్యూలేటర్ అప్రూవల్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.
అంతకంటే ముందే ఫైజర్ వ్యాక్సిన్ కు అప్రూవల్ వస్తే.. అది కూడా పిల్లలకు వాడుకోవచ్చు. జైడస్ వ్యాక్సిన్ అప్రూవల్ ఈ లోపే జరిగితే అది కూడా ఒక ఆప్షన్ అవ్వొచ్చని డా.గులేరియా స్పష్టం చేశారు.