ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టారు. ఆదాయాలకు ఊతం ఇవ్వడం, కొనుగోలు శక్తి పెంచడం, ఆర్థకవ్యవస్థ యొక్క ప్రాథమికాలను బలోపేతం చేయడం.అదే విదంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం లక్ష్యాలతో బడ్జెట్ రూపొందిచబడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అసలు ఈ రోజు బడ్జెట్ ప్రకటనలతో లాభపడిందెవరు,నష్టపడిదెవరో ఒకసారి చూద్దాం.
విన్నర్లు
ట్రాన్స్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
రహదారి మరియు రైల్వేల కోసం ప్రణాళికలను నిర్మల సీతారామన్ ఆవిష్కరించారు. రవాణా మౌలిక సదుపాయాల కోసం 1.7 ట్రిలియన్ రూపాయలు (23.7 బిలియన్ డాలర్లు) ప్రతిపాదించారు, ఇందులో హైవేల వేగవంతమైన అభివృద్ధి మరియు 12 హైవే 12 హైవే బండల్స్ మోనటైజ్ చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి. లార్సన్ & టౌబ్రో మరియు కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మరియు ఐఆర్బి ఇన్ఫ్రా వంటి ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ దీని వల్ల ప్రయోజనం పొందారు.
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్
మొబైల్ ఫోన్స్,ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, సెమీకండెక్టర్ తయారీ,అదేవిధంగా మెడికల్ పరికరాల తయారీలను ప్రొత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఆర్థికమంత్రి ప్రకటన డిక్సన్ టెక్నాలజీస్,అంబర్ ఎంటర్ ప్రైజెస్,సుబ్రోస్ వంటి కంపెనీలకు ఇది లాభపడే అంశమని ఇండియా నివేష్ కంపెనీలో ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ వినయ్ పండిట్ తెలిపారు.
గ్రామీణ భారతం
వ్యవసాయ,గ్రామీణ రంగాలకు 2.83ట్రిలియన్ రూపాయలను కేటాయించారు. వచ్చే ఏడాది నాటికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 15 ట్రిలియన్ రూపాయలుగా నిర్ణయించారు. ఫిషరీస్ ను విస్తరించడం మరియు 500 ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు సృష్టించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించిన నేపథ్యంలో అవంతి ఫీడ్స్,అఫెక్స్ ప్రొజెన్ ఫుడ్స్ అండ్ వాటర్ బేస్ కంపెనీలు లాభం పొందుతున్నాయి.
రైల్ సర్వీసు ఎయిర్ కండీషన్డ్ ఫ్రీయట్ కార్స్(సరుకురవణా కార్స్)తో అమర్చనున్నాయని, గిడ్డంగుల కోసం ప్రభుత్వం సాధ్యత గ్యాప్ నిధులను అందిస్తుందని మంత్రి ప్రకటించారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్…సరుకు రవాణా రైళ్లు, కోల్డ్ స్టోరేజ్ మరియు గిడ్డంగుల ప్రకటనలలో అతిపెద్ద విజేతగా నిలిచింది.
వాటర్
నీటి లభ్యత తక్కువ ఉన్న జిల్లాల్లో వ్యవసాయ రంగ వృద్ధికి సహాయపడే చర్యలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో నీరుమరియు మురుగునీటి శుద్ధి ప్లాంట్ లను డిజైన్ చేసే,నిర్మించే VA టెక్ వాబాగ్ లిమిటెడ్ కంపెనీ షేర్లు బాగా పెరిగాయి.
ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఇవమ్ ఉద్దాన్ మహాభియాన్(PM KUSUM)ను విస్తరిస్తామని,దీంతో 20లక్షలమంది రైతులకుస్వతంత్ర సోలార్ పంపుల ఏర్పాటులో సాయం అందిస్తామని , దీంతోసాగులేని భూముల్లో సోలార్ కేంద్రాలను ఉపయోగించడం వల్ల రైతులకు ఆదాయం వస్తుందని ఆర్థికమంత్రి ప్రకటించిన తర్వాత శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు మూడు వారాల్లో అత్యధికంగా దూసుకెళ్లాయి.
3.6 ట్రిలియన్ రూపాయల ఫండింగ్ తో 2024నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ పైపు వాటర్ ను అందించాలని కేంద్రం వేసుకున్న ప్రణాళికతో జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్,కేఎస్ బీ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, జేకే అగ్రి జెనిటిక్స్ లిమిటెడ్,పీఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభపడుతున్నాయి.
క్లీన్ ఇండియా మిషన్ కోసం 123 బిలియన్ రూపాయలను ఖర్చు చేయనున్నట్లుకూడా ఆర్థికమంత్రి ఇవాళ ప్రకటించారు. హిందుస్తాన్ యూనిలివర్,ఐటీసీ,గోద్రెస్ కంపెనీలు కూడా ఇక్కడ బాగా లాభపడుతున్నాయి.
టెల్కోస్
గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకువచ్చే కార్యక్రమం అయిన భారత్ నెట్ – లేదా భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్‌ను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు 60 బిలియన్ రూపాయలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు HFCL లిమిటెడ్ లబ్ది పొందనున్నాయి.
ఆన్ లైన్ ఎడ్యుకేటర్స్
2020-21లో ఈ రంగానికి 993 బిలియన్ రూపాయలు కేటాయింపుతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో విద్యకు గణనీయమైన శ్రద్ధ లభించింది. నేషనల్ ఇనిస్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో టాప్ 100 లోపు ఉన్న సంస్థలు అందించే డిగ్రీ-స్థాయి, పూర్తి స్థాయి ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలు…నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు MT ఎడ్యుకేర్ లకు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
ఐటీ సంస్థలు
ప్రైవేట్ సెక్టార్…డేటా సెంటర్ పార్క్ లు నిర్మించడానికి త్వరలో తీసుకురాబోయే పాలసీ గురించి ప్రకటించడంతో అన్ని ఐటీ సంస్థలు బాగా లాభపడనున్నాయి. ఎల్ టీఐ,మైండ్ ట్రీ,పర్సిస్టెంట్,హెక్సావేర్ వంటి మధ్య-పరిమాణ సంస్థలతో పాటు టీసీఎస్,ఇన్ఫోసిస్.విప్రో.హెచ్ సిఎల్ టెక్నాలజీస్,టెక్ మహీంద్రా కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రకటనతో ఆదానీ ఎంటర్ ప్రెజెస్ కూడా లాభపడనుంది.
పైప్ లైన్ అండ్ సిటీ గ్యాస్ సప్లయర్స్
16,200కిలోమీటర్ల నుంచి 27వేల కిలీమీటర్ల వరకు నేషన్ గ్యాస్ గ్రిడ్ ను విస్తరించాలని భారత్ ఫ్లాన్ చేస్తోంది. వెల్సపన్ కార్ప్,మహారాష్ట్ర సీమ్లెస్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్,జిందాల్ సా అండ్ మ్యాన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు ఈ నిర్ణయంతో లాభపడనున్నాయి. గుజరాత్ గ్యాస్,ఎమ్ జీఎల్,ఐజీఎల్ వంటి కంపెనీలకు కూడా నేషనల్ గ్రిడ్ విస్తరణ పాజిటివ్ గా ఉండనుంది.
లూజర్స్
ఇన్స్యూరెన్స్
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(LIC)లో వాటాలను అమ్మబోతున్నట్లు ప్రకటన చేయడంతో ప్రైవేట్ ఇన్స్యూరర్స్ షేర్లు గణనీయంగా పడిపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కో మరియు నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ లాగా ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో నష్టపోయాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు
2020-21 సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొత్త మూలధనాన్ని ప్రవేశపెట్టడంపై ఆర్థిక మంత్రి మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వం కొత్తగా మూలధనాన్నిప్రవేశపెట్టడం చేయకపోతే, ఇది 2014 తరువాత మోడీ ప్రభుత్వంలో మొదటిది. ఎస్ బీఐ లిమిటెడ్,బ్యాంక్ ఆఫ్ బరోడా,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,బ్యాంక్ ఆఫ్ ఇండియా,పంజాబ్ నేషనల్ బ్యాంక్ లపై దీని ప్రభావం పడనుంది.
ఎరువుల కంపెనీలు
ప్రోత్సాహకాల మార్పుతో రసాయన ఎరువుల వాడకాన్ని సమతుల్యం చేయాలని నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే సున్నా-బడ్జెట్ వ్యవసాయంపై ఆమె నూతన దృష్టిని ప్రకటించింది. దీంతో రాష్ట్రీయ కెమికల్స్అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వంటి ఎరువుల తయారీ కంపెనీలు నష్టపోయినవాటిలో ఉన్నాయి. మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్,చంబాల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్,మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లు కూడా ఈ ప్రకటనతో నష్టపోతున్నవారిలో ఉన్నారు.
లాజిస్టిక్స్ ప్లేయర్స్
చాలా కాలంగా దేశం ఎదురుచూస్తున్న నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో ఆలస్యం… బ్లూ డార్ట్,గటి అండ్ మహీంద్రా లాజిస్టిక్స్ వంటి కంపెనీలకు నిరాశను మిగిల్చింది. చాలా ఏళ్లుగా వీళ్లు ఆ పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు.
రియల్ ఎస్టేట్ అండ్ కనస్ట్రక్షన్
ఈ రంగానికి ఎలాంటి ప్రత్యేకమైన ప్రకటనలు ఆర్థికమంత్రి చేయకపోవడంతో…గోద్రేజ్ ప్రాపర్టీస్,ఒబెరాయ్ రియాల్టి లిమిటెడ్,డీఎల్ఎఫ్ లిమిటెడ్,ప్రిస్టేజ్ ఎస్టేట్స్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. డెవలపర్‌లకు క్రెడిట్ లభ్యతను పెంచే చర్యలు, పరిశ్రమల స్థితిగతులు మరియు అమ్మకాలను ప్రోత్సహించే ఇతర చర్యలను ప్రాపర్టీ సెక్టార్ కోరింది.
భారతదేశ ఆర్థిక కలలను బద్దలుకొట్టిన సంక్షోభం
వ్యక్తిగత పన్ను రేట్ల ప్రతిపాదిత కోత మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచుతుంది. బడ్జెట్‌లో ప్రకటించిన సరసమైన గృహాల కోసం పన్ను సాప్‌లను కొనసాగించడం రియల్ ఎస్టేట్ స్టాక్‌లను ప్రోత్సహించడంలో విఫలమైంది.