Parliament Session : డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. సభ ముందుకు పలు కీలక బిల్లులు

డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. 

Parliament

Parliament Winter Sessions : డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఈ సమావేశమైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని భావిస్తోంది.

ఈ అఖిల పక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ తో పాటు పలు పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఎన్సీపీ నేత ఫౌజియా ఖాన్, ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్రం అఖిల పక్ష సమావేశంలో పార్టీల నేతలకు తెలియజేయనుంది. తెలంగాణలో ఎప్పటినుంచో డిమాండ్ లో ఉన్న ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు అంశం కూడా ఈ సమావేశాల్లో సభముందుకు రానుంది.

కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరవాత జరుగనున్న పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటోంది. ప్రస్తుతం 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరో 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలన్న సిఫార్సును కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులు కూడా సభ ముందురానున్నాయి. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఎలక్షన్‌ కమిషనర్ల నియామక బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశముంది. దీంతో శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా జరగనున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్షాలు ఎలా స్పందించనున్నాయో వేచి చూడాలి.

Also Read: హైదరాబాద్‌కు కర్ణాటక డిప్యూటి సీఎం.. గెలిచిన అభ్యర్ధుల బాధ్యత డీకే శివకుమార్‌దే!

ట్రెండింగ్ వార్తలు