Ahmedabad
Ahmedabad : ఓ మహిళా కానిస్టేబుల్ తన 6 నెలల కొడుకుతో కలిసి ‘గుజరాత్ హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్’ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె పరీక్ష అయ్యేవరకూ చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంది మరో మహిళా కానిస్టేబుల్. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalyani Railway Station : మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు
అహ్మదాబాద్‌లోని ఓధవ్‌లో గుజరాత్ ‘హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్’ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఓ మహిళా కానిస్టేబుల్ తన 6 నెలల చిన్నారితో కలిసి వచ్చింది. ఓ వైపు పరీక్ష మొదలు అవుతుంటే చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ పరిస్థితుల్లో పరీక్ష రాయడం అంటే ఆమెకు సవాల్ లాంటిది. ఇక పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ దయా బెన్ రంగంలోకి దిగి ఆ చిన్నారిని తన దగ్గరకు తీసుకుని ఆమె పరీక్షకు హాజరయ్యేందుకు సాయం చేసింది. కానిస్టేబుల్ చిన్నారితో ఆడుకుంటున్న ఫోటోలు అహ్మదాబాద్ పోలీసులు ట్విట్టర్ అకౌంట్ లో (@AhmedabadPolice) షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
‘అహ్మాదాబాద్ లోని ఓధవ్ లో పరీక్షలు రాస్తున్న ఓ తల్లికి దయా అనే మహిళా కానిస్టేబుల్ సాయం చేసింది. చిన్నారి ఏడుపు ప్రారంభించినప్పుడు దయా రంగంలోకి దిగి ఆ మహిళ పరీక్షలు రాయడానికి సహాయం చేసింది’ అనే శీర్షికతో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ‘చాలా ధన్యవాదాలు సోదరి’ అని..’ఒకరికొకరు సాయం చేసుకుంటూ సమాజం నుంచి ప్రశంసలు అందుకున్నారు’ అంటూ కామెంట్లు చేసారు. నిజంగా దయా బెన్ గ్రేట్ పోలీస్ స్టేబుల్.
ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાંઆવેલ છે pic.twitter.com/SIffnOhfQM
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 9, 2023