New Delhi : న్యూ ఢిల్లీలో భారీ వర్షం.. రైల్వే స్టేషన్‌లో విద్యుత్‌ఘాతంతో మహిళ మృతి

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌ఘాతంతో సాక్షి అహూజా అనే మహిళ మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Delhi

New Delhi : న్యూఢిల్లీలో విద్యుత్‌ఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన నీటిని దాటుతూ స్తంభాన్ని పట్టుకున్న ఆమెకు షాక్ తగిలి మరణించినట్లు తెలుస్తోంది.

Guinness World Records : 15 గంటలు.. 286 స్టేషన్లు.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సాధించిన శశాంక్ మను

న్యూఢిల్లీ ప్రీతి విహార్ కు చెందిన సాక్షి అహూజా ఉదయం 5.30 గంటలకు ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలతో రైల్వేస్టేషన్ కు వచ్చారు. వీరంతా చండీగఢ్ వెళ్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా ఏర్పడిన నీటి ప్రవాహాన్ని దాటుతూ సాక్షి అహూజా విద్యుత్ స్తంభాన్నిపట్టుకున్నారు. వెంటనే షాక్ కు గురై మరణించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో హెయిర్ స్ట్రెయిట్ చేసుకున్నయువతి వీడియో వైరల్ .. తిట్టిపోస్తున్న నెటిజన్లు

మృతురాలి సోదరి మాధవి చోప్రా, ఆమె తండ్రి లోకేష్ కుమార్ చోప్రా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదు చేశారు. విద్యుత్ స్థంభం కింద తెగిపడిన విద్యుత్ వైర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.