Odisha: జీవితాంతం అడుక్కోగా వచ్చిన డబ్బును జగన్నాథ గుడికి విరాళంగా ఇచ్చిన ఒక మహిళ

Odisha: తన జీతితాంతం యాచించగా వచ్చిన లక్ష రూపాయల డబ్బును జగన్నాథ గుడికి విరాళంగా ఇచ్చింది ఒక మహిళ. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఉన్న ఫుల్బాని అనే గ్రామంలో జగన్నాథుడి గుడి ఉంది. ఆ గుడికే తన సొత్తు మొత్తాన్ని ధారాదత్తం చేసింది. ఆ మహిళ పేరు తుల బెహెర. వయసు 70 సంవత్సరాలు. తుల భర్త ప్రఫుల్లా అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆమెకు యాచకం తప్ప మరే వృత్తి కనిపించలేదు. ఫుల్బాని పట్టణం సమీపంలోని గుడుల వద్ద గత 40 ఏళ్లుగా యాచిస్తూ జీవితం సాగిస్తోంది.

India-China clash: మన దేశం ‘చైనా పే చర్చా’ ఎప్పుడు చేస్తుంది? మోదీ ‘చాయ్ పే చర్చా’ను ఉద్దేశిస్తూ ఖర్గే విమర్శలు

భర్త, ఆమె ఇద్దరు గుడుల వద్ద యాచకం చేస్తూ జీవిస్తుండేవారు. అయితే కొంత కాలం క్రితం మరణించాడు. అయితే ఆమెకు భర్త తమ తప్ప తన అనుకునే ఎవరూ లేరు. అందుకే తనను తాను జగన్నాథుడికి సమర్పించాలని అనుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ధాను సంక్రాంతి అనే వేడుక జరిగింది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న లక్ష రూపాయలను జగన్నాథుడికి విరాళంగా ఇచ్చింది. గుడి యాజమన్య కమిటీ ఆ డబ్బును తీసుకున్నారు.

Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఈ విషయమై తుల స్పందిస్తూ ‘‘చాలా కాలంగా యాచించిన డబ్బును బ్యాంకులో దాచుకున్నాను. నాకు పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు. ఆ డబ్బుతో నేనేం చేసుకోవాలి? అందుకే ఆ జగన్నాథుడికే దానం చేశాను’’ అని చెప్పింది. తనకు వృద్ధాప్యం వచ్చి జగన్నాథునికి అంకితమైపోయినందున తనకు డబ్బు అవసరం లేదని చెప్పింది. ఫుల్బానీలోని పాత జగన్నాథ ఆలయ పునరుద్ధరణకు ఈ డబ్బును వినియోగించాలని ఆలయ నిర్వాహక కమిటీని ఆమె అభ్యర్థించింది. “ఆమె మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆమె పట్టుబట్టడంతో మేం దానిని అంగీకరించాలని నిర్ణయించుకున్నాము” అని కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు