India-China clash: మన దేశం ‘చైనా పే చర్చా’ ఎప్పుడు చేస్తుంది? మోదీ ‘చాయ్ పే చర్చా’ను ఉద్దేశిస్తూ ఖర్గే విమర్శలు

చైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే దాస్తోందో తెలియట్లేదు. యుద్ధం చేయడం కోసం చైనా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. కానీ భారత ప్రభుత్వం నిద్రలో ఉంది

India-China clash: మన దేశం ‘చైనా పే చర్చా’ ఎప్పుడు చేస్తుంది? మోదీ ‘చాయ్ పే చర్చా’ను ఉద్దేశిస్తూ ఖర్గే విమర్శలు

When will India hold 'China pe charcha', asks Congress chief

India-China clash: ఇండియా-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో.. పార్లమెంటులో ఈ విషయమై చర్చ చేయాలని ప్రతిపక్షం డిమాండు చేస్తుండగా, ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. అయితే ప్రధాన మంత్రి అప్పుడప్పుడు ‘చాయ్ పే చర్చా’ అంటూ తరుచూ నిర్వహించే కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ‘చైనా పే చర్చా’ ఎప్పుడంటూ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. దేశానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో చర్చకు రాకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Mumbai: శివాజీ, అంబేద్కర్‭లను అవమానించారంటూ మహా వికాస్ అగాడీ ‘హల్లా బోల్’ ర్యాలీ

‘‘వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉన్న జంఫేరి శిఖరం వరకు డోక్లామ్ ప్రాంతంలో చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం మన దేశ భద్రతకు అత్యంత ఆందోళన కలిగిస్తోంది’’ అని ఖర్గే ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చివరలో ‘‘నరేంద్రమోదీ జీ.. మన దేశం ‘చైనా పే చర్చ’ ఎప్పుడు చేస్తుంది?’’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీటులో నరంద్రమోదీని ట్యాగ్ చేశారు. చైనా-ఇండియా ఉద్రక్తితలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపిన మరునాడు ఖర్గే ఈ విధంగా స్పందించారు.

Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

‘‘చైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే దాస్తోందో తెలియట్లేదు. యుద్ధం చేయడం కోసం చైనా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. కానీ భారత ప్రభుత్వం నిద్రలో ఉంది’’ అని భారత్ జోడో యాత్ర 100వ రోజు సందర్భంగా రాజస్తాన్ రాజధాని జైపూర్‭లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ అన్నారు.