Viral Video
Viral Video: నది వద్ద యోగా చేస్తూ వీడియో తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలనుకుంది ఓ యువతి. వెరైటీగా యోగా చేస్తే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తాయని భావించినట్టుంది. నదిపై కర్రలతో కట్టిన చిన్న బ్రిడ్జి వంటి దానిపై ఆమె “వంతెన భంగిమ” వేసింది.
అనంతరం ఆమె యోగా భంగిమ ముగించి, పైకి లేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయింది. చాలా కాలం క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నీటి ప్రవాహంలో పడిపోయిన అమ్మాయి పేరు మేరీ. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.
నీటిలో నుంచి బయటకు వచ్చాక తాను బాగా నవ్వుకున్నానని, ఎంతగా అంటే… తన జీవితంలో ఎన్నడూ నవ్వనంత నవ్వుకున్నానని చెప్పింది. యోగా చేయాలంటే ఇంట్లో చేసుకోవాలని, ఇలాంటి ప్రదేశాల్లో చేయకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రమాదకర ప్రదేశాల్లో సాహసాలు చేయాలని కొందరు సూచించారు.
Go with the flow ? pic.twitter.com/BGZ120HZYL
— Wtf Scene (@wtf_scene) February 24, 2023
Heart Attack : మీ కళ్లేదుటే ఎవరైనా గుండె పోటుకు గురై చలనం లేకుండా పడిఉంటే తక్షణం ఏమి చేయాలంటే ?