Woman Raped In Private Bus On Way To Delhi From Lucknow
ఓ ప్రైవేటు బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై అత్యాచారం జరిపాడు. యమున ఎక్స్ ప్రెస్ పై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ బస్సులో కొద్ది మంది మాత్రమే ప్రయాణీకులున్నారని, మంత్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న అనంతరం 112 హెల్ప్ లైన్ ను ఆశ్రయించిందని పోలీసులు తెలిపారు.
బస్సులో క్లీనర్ గా పనిచేస్తున్న రవి తనపై అత్యాచారం జరిపాడని మహిళ పోలీసులకు ఫిర్యాదులో వెల్లడించింది. అనంతరం బస్సులో నుంచి దింపేశాడని, తిరిగి ఈమె ఢిల్లీకి చేరుకుందన్నారు.
వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, రోహణి ప్రాంతంలో ఆమె ఇంటికి తరలించామన్నారు. అత్యాచారం జరిపిన రవిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించామన్నారు.