Woman Thrashed: సిగరెట్ తాగొద్దందని యువతి మొఖంపై పిడిగుద్దులు

ఆటోలో పక్కనే కూర్చొని పొగ తాగుతున్న వ్యక్తిని వద్దని వారించిన మహిళపై పిడి గుద్దులు కురిపించాడు. నిందితుడు ఫరీదాబాద్‌లోని బల్లాభ్‌ఘడ్‌లో ఉంటున్న వాసు సింగ్ కాగా బాధితురాలిని...

Women Cigarette

Woman Thrashed: ఆటోలో పక్కనే కూర్చొని పొగ తాగుతున్న వ్యక్తిని వద్దని వారించిన మహిళపై పిడి గుద్దులు కురిపించాడు. నిందితుడు ఫరీదాబాద్‌లోని బల్లాభ్‌ఘడ్‌లో ఉంటున్న వాసు సింగ్ కాగా బాధితురాలిని సుమన్ లతా ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతానికి చెందినదిగా అధికారులు తెలిపారు.

గురుగ్రామ్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న లతా.. సోమవారం సాయంత్రం ఇంటికి షేర్ ఆటోలో బయల్దేరింది. సెక్టార్ 46వద్ద గ్రీన్ వుడ్ సిటీకి చేరకోగానే మరో వ్యక్తి ఆటోలో పక్కనే కూర్చొన్నాడు. ఆ సమయంలో కోపం వచ్చి సిగరెట్ తాగొద్దని చెప్పింది. అప్పటికీ మాట వినకపోవడంతో సిగరెట్ తీసి విసిరికొట్టింది.

వాసు సింగ్ మహిల మొఖంపై రెండు సార్లు గుద్ది బూతులు తిట్టి ముక్కు నుంచి రక్తం కారుతుండగా ఆటో దించేసి వెళ్లిపోయారు. డ్రైవర్ ఆటో ఆపడంతో పోలీసులకు, నా కుటుంబానికి ఇన్ఫామ్ చేశానని బాధితురాలు పేర్కొంది.

Read Also: సినిమా టికెట్ల రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు

పోలీస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని సింగ్ ను సెక్షన్స్ 323, 325, 509 కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరవుతానని చెప్పి బెయిల్ మీద విడుదలయ్యాడు నిందితుడు.