Viral Video: ఓ బంగారం దుకాణంలోకి కస్టమర్‌లా వెళ్లిన ఓ మహిళ కౌంటర్‌లో ఉన్న యువకుడికి కళ్లల్లో కారం కొట్టింది. నగల షాపులో చోరీ చేయాలని భావించింది. అయితే, వెంటనే తేరుకున్న ఆ యువకుడు ఆ మహిళ తుక్కు రేగ్గొట్టాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ముఖంపై 25 సెకన్లలో దాదాపు 20 పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఊహించని పరిణామానికి ఆ లేడీ కేడీ భయపడిపోయింది. (Viral Video)
Also Read: ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన
నవంబర్ 3న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దుపట్టాతో ముఖాన్ని కప్పుకున్న ఆ మహిళ అహ్మదాబాద్‌లోని రణీప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం, వెండి దుకాణంలో కస్టమర్‌లా నటిస్తూ ప్రవేశించింది.
ఆ వెంటనే ఆమె అకస్మాత్తుగా దుకాణదారుడి కళ్లలోకి మిరప పొడి వేసింది. అయితే కారం అతడి కళ్లలో సరిగ్గా పడలేదు. ఆ మహిళ ఉద్దేశాన్ని గ్రహించిన దుకాణదారుడు వెంటనే లేచి కౌంటర్‌పైకి ఎగిరి ఆమెను బయటకు లాగుతూ కొట్టాడు.
దుకాణదారుడు ఈ ఘటనపై ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించాడని, అయినప్పటికీ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేయాలని వ్యాపారిని రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసినట్టు చెప్పారు.
In Ahmedabad, a woman tried to rob a jewelry store owner by throwing red chili powder into his eyes.
Even after the chili got into his eyes, the owner stood strong.#IPL2026 #Kumbha #Fourthnattawat pic.twitter.com/rAqmVDlVpo
— 🦋 KOMAL SINGH🦋 💯 Follow Back (@Singh_Komall) November 7, 2025
अहमदाबाद की रानीप विस्तार की ज्वेलर्स की दुकान में एक महिलाने दुकानदार की आंख में मिर्ची डालकर लूंट का प्रयास किया। फिर भी पुलिस ने FIR दर्ज करने से मना कर दिया@GujaratPolice @ansari2487@jigars24 @Shailesh_1284@GujaratLion10 @dgpgujarat
👇👇👇👇👇👇https://t.co/o0wOqLnrTb— RN_Kansara (@RAMESHSOLANKI0) November 6, 2025