Woman Uses Ocean Water To Cook Pasta On The Beach
Viral video : సముద్రం ఒడ్డున కూర్చుని నచ్చిన ఫుడ్ తింటూ ఉంటే ఆ మజాను మాటల్లో చెప్పలేం. మనలో చాలా మంది ఇలా చేసే ఉంటారు. కొందరు ఇంట్లో చేసిన వంటకాలను తీసుకుని వచ్చి బీచ్‌లో కూర్చుని తింటే మరికొందరు మాత్రం అక్కడ దొరికితే వాటిని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే.. కంటెంట్ సృష్టికర్త అవేరి సైరస్ మాత్రం మూడో విధానాన్ని ఎంచుకుంది. బీచ్ దగ్గరే ఆమె తనకు ఇష్టమైన ఆహారాన్ని వండుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాగా దాదాపు 18 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. అయితే.. ఆమె సముద్రపు నీటితో వంట చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కట్టెలను పొయ్యిలో వేయడంతో వీడియో ఆరంభం అవుతుంది. చాప్‌బోర్డు పై కొంత పిండిని ఉంచింది. కాస్త గుంటగా చేసి అందులో రెండు గుడ్లను పగులగొట్టింది. ఆ తరువాత పిండిని బాగా పిసికి కలిపింది. అనంతరం సాస్ కోసం ఆమె ఒక పాన్‌లో కొంత వెన్నను కరిగించి తరిగిలిన వెల్లుల్లి, క్రీమ్, తురిమిన పర్మేసన్ చీజ్, అలాగే కొన్ని చీజ్ క్యూబ్‌లను కూడా వేసింది. కొంచెంత సమయం తరువాత సాస్ తయారు కావడంతో దానిని పక్కన పెట్టింది
PM Modi : ప్రధాని మోదీ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా..? పంచెకట్టు.. కట్టెల పొయ్యిపై పాయసం
ఆ తరువాత సముద్రం వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. పాస్తాను ఉడకబెట్టడానికి సముద్రపు నీటిని పాన్‌లో తీసుకుని వచ్చింది. పిండిని బయటకు తీసి.. నూడిల్ లాంటి తీగలుగా కట్ చేసింది. ఆపై వాటిని సముద్రపు నీటిలో ఉడకబెట్టడం ప్రారంభించింది. పాస్తా ఉడికిన తర్వాత, ఆమె దానిని సాస్‌తో కలిపింది. ఆ తరువాత గార్నీష్ చేసింది. సాయంత్రపు సంధ్యాసమయంలో తాను చేసుకున్న వంటను ఆస్వాదించింది.
ఈ వీడియో వైరల్‌గా మారగా.. వంటకం చేసేటప్పుడు సముద్రపు నీటిని ఉపయోగించడం గురించి చాలా మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరదా కోసం చేసిన పని కావొచ్చునని కొందరు అనగా.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. సముద్రపు నీరు శుభ్రమైన నీరు కాదని, వంటలో వాటిని ఉపయోగిస్తే లేని పోని రోగాలు వచ్చే అవకాశం ఉందని కామెంట్లు పెడుతున్నారు.
Viral Video : గ్యాస్ స్టవ్‌ను ఇలా వెలిగించాలని తెలియక.. ఎన్ని లైటర్లు కొన్నామో..!