PM Modi : ప్ర‌ధాని మోదీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ చూశారా..? పంచెక‌ట్టు.. క‌ట్టెల పొయ్యిపై పాయ‌సం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.

PM Modi : ప్ర‌ధాని మోదీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ చూశారా..? పంచెక‌ట్టు.. క‌ట్టెల పొయ్యిపై పాయ‌సం

Modi Pongal Celebrations

Updated On : January 14, 2024 / 3:10 PM IST

Modi Pongal Celebrations : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగ‌న్ నివాసంలో జ‌రిగిన వేడుక‌ల‌కు ప్ర‌ధాని హాజ‌రు అయ్యారు. సంప్ర‌దాయ దుస్తులను ఆయ‌న ధ‌రించారు. తెల్ల లుంగి, న‌ల్ల కోటును ధ‌రించిన మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పండుగ సంద‌ర్భంగా క‌ట్టెల పొయ్యిపై పాయ‌సం వండారు. గోమాతకు సారె స‌మ‌ర్పించి పూజ చేశారు.

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ యొక్క భావోద్వేగాన్నిపొంగ‌ల్ పండుగ వర్ణిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు. త‌న సొంత బంధువుల‌తో క‌లిసి పొంగ‌ల్‌ను జ‌రుపుకుంటున్న‌ట్లు తాను భావిస్తున్న‌ట్లు అన్నారు.. అంద‌రి జీవితాల్లో ఆనందం, శ్రేయ‌స్సు, సంతృప్తి ప్ర‌వ‌హించాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా తెలిపారు.

IndiGo: నా జీవితంలో ఇలాంటి ఘోర అనుభవం ఇంతకుముందు ఎప్పుడూ ఎదురుకాలేదు: విమాన ప్రయాణికుడు

ప్రధాని మోదీ మకర సంక్రాంతి, బిహు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశం నిన్న లోహ్రీ పండుగను జరుపుకుంది. కొంతమంది ఈ రోజు మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఇంకొంద‌రు రేపు జరుపుకుంటారు, మాఘ బిహు కూడా వస్తోంది, ఈ పండుగల సంద‌ర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియ‌జేశారు మోదీ.

అనంతరం మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ తిలకించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌దిత‌రులు వేడుక‌ల్లో పాల్గొన్నారు.

BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎన్ని సీట్లో తెలుసా? ఏయే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయ్?