IndiGo: నా జీవితంలో ఇలాంటి ఘోర అనుభవాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఎదుర్కోలేదు: విమాన ప్రయాణికుడు

గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. చివరకు..

IndiGo: నా జీవితంలో ఇలాంటి ఘోర అనుభవాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఎదుర్కోలేదు: విమాన ప్రయాణికుడు

IndiGo

Updated On : January 14, 2024 / 3:32 PM IST

ఓ విమాన ప్రయాణికుడికి ఇండిగో ఎయిర్‌లైన్స్ చుక్కలు చూపించింది. తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో వివరిస్తూ పోస్ట్ చేశాడు ఆ ప్రయాణికుడు ‘నా జీవితంలో ఇలాంటి ఘోర అనుభవాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని ఆ విమాన ప్రయాణికుడు చెప్పాడు.

ఆ ప్రయాణికుడి పేరు దేబర్జ్య దాస్. కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి సరైన సమయానికి వచ్చాడు. అయినప్పటికీ గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

‘రాత్రి 10 గంటలకు నేను కోల్‌కతా-బెంగళూరు ఇండిగో విమానం ఎక్కాల్సి ఉంది. అది ఆలస్యం కావడంతో మరుసటి రోజు తెల్లవారుజామున 4.41 గంటలకు ఎక్కాల్సి వచ్చింది. ఆరు సార్లు విమానం ఆలస్యమైందని ప్రకటించారు..

మొత్తం ఏడు గంటల సమయం వృథా అయింది. దీంతో బెంగళూరులో నేను ఎక్కాల్సిన అంతర్జాతీయ విమానం మిస్ అయింది’ అని ఆ ప్రయాణికుడు చెప్పాడు.

ఆలా విమానం ఆలస్యమైతే చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆ ప్రయాణికుడు అన్నాడు.  తనకు రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుందని.. ఇండిగో అలా చేయలేదని వివరించాడు. దీంతో చివరకు ఇండిగో అతడికి రీఫండ్ చేసింది.

Amabti Rambabu : మళ్లీ వేసేశాడు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్