ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల కోసం దేశాలు వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాయనే విషయం తెలిసిందే. నియమాలు, నిబంధనలు అనుసరించి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా.. వరల్డ్ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకుంది. గత 10ఏళ్లలో ప్రపంచ బ్యాంకు నుంచి భారతదేశం తీసుకునే అప్పు పెరుగుతూనే ఉంది. గత నాలుగేళ్లలోనే 5బిలియన్ డాలర్ల రుణంను భారత్ వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకుంది.
కీలక రంగాలపై ఖర్చుచేసే ఉద్ధేశ్యంతో 2009 నుంచి వరల్డ్ బ్యాంక్ తీసుకుంటున్న అప్పు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది. అయితే 2010 తర్వాత ప్రపంచ బ్యాంకు అన్నిదేశాలకు ఇచ్చే రుణాన్ని తగ్గిస్తోంది. 2010 ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కారణంగా వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్థికమాంద్యంతో రుణం తీసుకునే అవకాశం తగ్గడంతో 2010లో ఇండియా 9.3 బిలియన్ డాలర్ల రుణం తీసుకోగా.. మరుసటి ఏడాది నుంచి రుణం ఒక్కసారిగా తగ్గిపోయింది. కీలక రంగాలకే నిధులు కేటాయించాలని ఇండియాకు ప్రపంచ బ్యాంకు స్పష్టంచేసింది. ఏటేటా రుణ విలువ కూడా తగ్గిస్తూ వస్తోంది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియా తీసుకున్న రుణం ద్వారా రహదారుల అభివృద్ధి, విద్యుత్, మౌలిక వసతుల సదుపాయ కల్పన, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విపత్తుల నిర్వహణశాఖ కోసం ఇండియా ఖర్చు చేస్తోంది. అలాగే ఒడిశా-ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుపాను సాయం కింద రుణం అందజేసిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
ఇదిలా ఉంటే కొత్తగా 137మిలియన్ డాలర్లను వరల్డ్ బ్యాంక్ ఇండియాలోని ముఖ్యమైన డ్యామ్ లను ఆధునికీకరణ చేసేందుకు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది. కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలోని డ్యామ్ లను పునర్నిర్మించేందుకు ఈ అప్పును వాడవలసి ఉంది. ఇండియా మొత్తం మీద 5200 పెద్ద డ్యాములు ఉండగా 400డ్యామ్ లు ప్రస్తుతం నిర్మాణ పనులు జరుతున్నవి ఉన్నాయి. వీటన్నిటి స్టోరేజ్ 300బిలియన క్యూబిక్ మీటర్లు.