ఎయిర్ పోర్టులు చూసే ఉంటారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యుత్ వెలుగులతో విమానశ్రయాలు మెరిసిపోతుంటాయి. ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్లలో కూడా త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో వెలుగులు విరజిమ్మనున్నాయి.
ఎయిర్ పోర్టులు చూసే ఉంటారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యుత్ వెలుగులతో విమానశ్రయాలు మెరిసిపోతుంటాయి. ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్లలో కూడా త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో వెలుగులు విరజిమ్మనున్నాయి. దాదాపు 690 భారత రైల్వే స్టేషన్లలో ఎయిర్ పోర్టుల్లో ఉండే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నట్టు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ నేతృత్వంలోని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 690 రైల్వే స్టేషన్లలో ఎయిర్ పోర్టు ప్రమాణాలను అందించున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ల ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా భారత రైల్వే శాఖ అడుగులు వేస్తోంది.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎలక్షన్ కంప్లయింట్స్ ఎవరైనా చేయొచ్చు
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 190కి పైగా రైల్వేస్టేషన్లను (రాష్ట్ర రాజధానిలు లేదా లక్షల నగరాలు, టూరిస్ట్, ప్రధాన నగరాల్లో) విద్యుత్ ఆధునీకరణ కోసం ఎంపిక చేశారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 190 రైల్వే స్టేషన్లను గుర్తించగా.. అందులో 100 రైల్వే స్టేషన్లను ఇదివరకే అప్ గ్రేడ్ చేశారు. ఇతర రైల్వే స్టేషన్లలో కూడా విద్యుత్ ఆలంకరణకు ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మొత్తం ఏర్పాట్లు ఏప్రిల్ 2019 నాటికి పూర్తి చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే పబ్లిక్ నుంచి అదిరిపోయే రిస్పాన్స్ వచ్చిందని రైల్వే మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
దీంతో దేశ వ్యాప్తంగా అదనంగా మరో 500కు పైగా రైల్వే స్టేషణ్లలో విద్యుత్ ఆధునీకరణ స్థాయిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య 690కి చేరింది. అంతేకాదు.. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లను అందంగా తీర్చిదిద్దే పనిలో భారత రైల్వే నిమగ్నమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 68 రైల్వే స్టేషన్లలను అప్ గ్రేడ్ చేసి.. రైల్వే ప్రయాణికులకు వసతులు, సదుపాయాలను అందించాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు నేషనల్ ట్రాన్స్ పోర్టర్ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్లు మథుర జంక్షన్, జైపూర్ జంక్షన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, సాయి నగర్ షిరిడీ స్టేషన్, లోనవాలా స్టేషన్లలో ప్రాసెస్ మొదలైనట్టు తెలిపింది.
అదనంగా హబిబ్ గంజ్, గాంధీనగర్ స్టేషన్లను కూడా ఎయిర్ పోర్ట్ తరహాలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లుగా మార్చేస్తున్నట్టు పేర్కొంది. భారత రైల్వే నెట్ వర్క్ లో అన్ని మౌంటేయన్ రైల్వేల్లో విస్తాడోమ్ కోచ్ లను తీసుకురానున్నట్టు రైల్వే మంత్రి గోయెల్ తెలిపారు. ఈ ఫీచర్ ముందుగా నీలగిరి మౌంటేయన్ రైల్వేలో తీసుకురానున్నట్టు చెప్పారు. ఇప్పటికే కోచ్ ల తయారీకి సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయాని, దాదాపు వంద కోచ్ ల వరకు తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు.
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి