పారా గ్లైడింగ్..ఆపండ్రోయ్ : ఏడుస్తూ..నవ్వించాడు

అరే..వద్దురా భయ్..పారా గ్లైడింగ్ నుంచి కిందకు దింపేయండి..వామ్మో..భయ్యా..ల్యాండ్ అవుదాం..ఎక్కువగా డబ్బులు ఇస్తా..దించేయ్ అంటూ..ఓ వ్యక్తి ఏడుస్తూ..చెప్పాడు. భయంతో కేకలు పెట్టిన ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫొటోలు మీమ్స్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఇతను చేసిన పనికి నెటిజన్లకు కామెడీగా అయిపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో చోటు చేసుకుంది.
విపిన్ సాహూ యువకుడు..స్నేహితులతో మనాలీ వెళ్లాడు. దోభీ ప్రాంతం వద్ద పారాగ్లైడింగ్ చేస్తున్నారు. స్నేహితులు చెప్పడంతో విపిన్ రెడీ అయ్యాడు. విపిన్‌తో పాటు ఒక ట్రైనర్ కూడా ఉన్నాడు. పైకి ఎగిరిన తర్వాత అతడికి భయం పట్టుకుంది. వద్దురా భయ్..కిందకు దింపేయండి..అంటూ మొర పెట్టుకున్నాడు. ఏం కాదు..అంటూ ట్రైనర్ చెబుతున్నాడు. అయినా విపిన్ వినిపించుకోలేదు. అటు..ఇటు కదులుతున్నాడు. కాళ్లు పైకి పెట్టు..లేదంటే కాళ్లు విరిగిపోతాయి..నీవు అసలు మనిషివేనా ? అంటూ ట్రైలర్ కసరుకోవడం..వద్దు..కిందకు దింపూ అంటూ మొర పెట్టుకున్నాడు.
నవ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మానందం చేసినట్లుగా గగ్గోలు పెట్టాడు. ఇతని హావభావాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
*boards flight for the first time*
*little turbulence happen*
me to pilot: pic.twitter.com/BSJgww9NsZ
— Fauxy capt. (@thephukdi) August 26, 2019