Yellow alert : పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్‌లలో వచ్చే వారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది.....

Rains

IMD Yellow alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్‌లలో వచ్చే వారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ముంబయితో పాటు పాల్ఘార్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, జల్గావ్, నాసిక్, పూణే, కొల్హాపూర్, సతారా, సాంగ్లీ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.

ఈ వర్షాల వల్ల ముంబయిలో వాయు కాలుష్యం తగ్గే అవకాశముందని అధికారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. గురువారం ముంబయి నగరంలో వాయు నాణ్యత సూచీ మోడరేట్ కేటగిరీలో నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

మహారాష్ట్ర అంతటా నవంబర్ 26నుంచి 28వతేదీ వరకు భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశామని ముంబయి ఐఎండీ అధిపతి సునీల్ కాంబ్లే చెప్పారు. కేరళ, తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ నగరాల్లో వరదల పరిస్థితి నెలకొంది. కేరళ రాష్ట్రంలోని హై రేంజ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

ALSO READ : Mumbai Airport :ముంబయి విమానాశ్రయాన్ని 48 గంటల్లో పేల్చివేస్తాం.. ఈమెయిల్ బెదిరింపు

ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అకాల వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా భారత వాతావరణ శాఖ పతనంతిట్ట జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ జిల్లాలో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

ALSO READ : Vijay – Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్ పై క్లారిటీ..?

తమిళనాడులోని పలు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం కావడంతో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులో తుపాన్ కారణంగా వచ్చే ఐదు రోజుల్లో కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

ALSO READ : Love Married : ఇండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ప్రేమ పెళ్లి..,వధువు ఎవరంటే తన చిరకాల ప్రియురాలు

ట్రెండింగ్ వార్తలు