Love Married : ఇండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ప్రేమ పెళ్లి..,వధువు ఎవరంటే తన చిరకాల ప్రియురాలు

భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన చిరకాల ప్రియురాలైన స్వాతి ఆస్థానాను పెళ్లాడాడు. ప్రేమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘నా చిరకాల ప్రియురాలైన స్వాతిని వివాహం చేసుకున్నాను, మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం, మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమను కోరుకుంటున్నాను’’ అని నవదీప్ సైనీ తన అభిమానులు, పెద్దల ఆశీర్వాదం కోరారు.....

Love Married : ఇండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ప్రేమ పెళ్లి..,వధువు ఎవరంటే తన చిరకాల ప్రియురాలు

India Pacer Navdeep Saini,Swati Asthana

Updated On : November 24, 2023 / 8:08 AM IST

Love Married : భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన చిరకాల ప్రియురాలైన స్వాతి ఆస్థానాను పెళ్లాడాడు. ప్రేమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘నా చిరకాల ప్రియురాలైన స్వాతిని వివాహం చేసుకున్నాను, మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం, మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమను కోరుకుంటున్నాను’’ అని నవదీప్ సైనీ తన అభిమానులు, పెద్దల ఆశీర్వాదం కోరారు.

ALSO READ : Today Headlines : తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ అగ్రనేతలు.. ఇవాళ, రేపు ప్రియాంక గాంధీ పర్యటన

క్రికెటర్లు రాహుల్ తెవాటియా, మొహ్సిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్,అర్ష్‌దీప్ సింగ్ నవదీప్ సైనీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ సిరాజ్ కూడా అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇషాన్ కిషన్ పోస్ట్‌ను లైక్ చేశారు. స్వాతి ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ బ్లాగర్. స్వాతికి తన రోజువారీ లేదా ట్రావెల్ బ్లాగ్‌లతోపాటు యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 80,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణానికి చెందిన నవదీప్ దేశంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు. అతని వయస్సు 31 సంవత్సరాలు.

ALSO READ : Mossad to target Hamas leaders : హమాస్ నేతలు లక్ష్యంగా మొసాద్ స్పెషల్ ఆపరేషన్

నవదీప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్, దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నారు. ఇతను భారతదేశం తరపున అన్ని ఫార్మాట్లలో ఆడారు. నవదీప్ అంతర్జాతీయ అరంగేట్రం 2019 వ సంవత్సరం ఆగష్టు 3వతేదీన వెస్టిండీస్‌తో తన మొదటి టీ20 మ్యాచ్ తో జరిగింది. అంతర్జాతీయ కెరీర్‌లో సైనీ 2 టెస్టులు, 8 ఓడీఐలు, 11 టీ20లు ఆడారు.సైనీ కూడా 32 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు.2020-21 పర్యటనలో ఆస్ట్రేలియాపై 2-1తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టులో నవదీప్ కూడా భాగమయ్యారు.