హిమాచల్ ప్రదేశ్‌కు ఎల్లో వార్నింగ్

  • Publish Date - November 21, 2019 / 06:14 AM IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. భారీగా మంచు కురవడంతో పాటు..అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొత్తం 12 జిల్లాల్లో ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఉరుములతో కూడిన వర్షం, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, కిన్నౌర్, లాహాల్ స్పితి జిల్లాల్లో భారీ వర్షంతో పాటు మంచు కురుస్తుందన్నారు. 

వాతావరణంలో నెలకొన్న పరిస్థితులు, ముందుగానే ప్రమాదం ఉందనే విషయాన్ని చెప్పడానికి కలర్ కోడెడ్ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది వాతావరణ శాఖ. ఎల్లో కలర్ కనీసం ప్రమాదాన్ని సూచిస్తుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. లాహల్ స్పితి అత్యంత శీతల ప్రాంతంగా ఉందని, 
కల్ప ఏరియాలో 1.6 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. మనాలీ, కుఫ్రి, షిమ్లా ఇతర ప్రాంతాల్లో 2.4, 6.7, 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని వెల్లడించారు. 
Read More : పొట్టి మహిళ ఇంట్లో దొంగతనం