Baba Ramdev : వామ్మో.. 59 ఏళ్ల వయసులో గుర్రంతో పోటీ.. మరోసారి వార్తల్లో రామ్ దేవ్ బాబా.. ఎంత రచ్చ రచ్చ జరిగిందంటే..

రాందేవ్ బాబా వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎంతకైనా తెగిస్తారా అంటూ విమర్శిస్తున్నారు.

Baba Ramdev : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. 59 ఏళ్ల వయసులో రాందేవ్ బాబా తన ఫిట్ నెస్ స్థాయి ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. గుర్రంతో పోటాపోటీగా పరుగులు పెడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారాయన. అయితే ఆ వీడియోలో తన పతంజలి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది.

పతంజలి ప్రొడక్ట్స్ వినియోగిస్తే 59 ఏళ్ల వయసులోనూ గుర్రంలా పరుగులు పెడతారంటూ ఆ వీడియోలో తెలిపారు. తన పతంజలి ప్రొడక్ట్స్ వినియోగిస్తే గుర్రంలాగా దౌడ్ తీస్తారంటూ రాందేవ్ బాబా పేర్కొన్నారు. 59 ఏళ్ల వయసులోనూ తన లాగా ఫిట్ గా ఉంటారంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, రాందేవ్ బాబా వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

తన సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా అంటూ విమర్శిస్తున్నారు. రాందేవ్ బాబా ఒలింపిక్స్ లో పాల్గొనాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా అంత వేగంగా పరుగులు పెడుతున్నారంటే రామ్ దేవ్ బాబా ఒలంపిక్స్ లో పాల్గొంటే బెటర్ అంటున్నారు. గుర్రంలా పరుగు పెట్టాలంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కావాలంటూ రామ్ దేవ్ బాబా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

రాందేవ్ బాబా వీడియోను ఉద్దేశించి.. బ్రియాన్ జాన్సన్.. హరిద్వార్ లో గాలి నాణ్యతకు సంబంధించి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఏ ప్రాంతంలో అయితే రామ్ దేవ్ బాబా నివాసం ఉంటున్నారో.. ఆ హరిద్వార్ లో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉందని జాన్సన్ చెప్పారు. అక్కడ గాలి నాణ్యత ఎంత దారుణంగా ఉందంటే.. ఆ కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయన్నారు. ప్రస్తుతం హరిద్వార్‌లో గాలి నాణ్యత ఎంత ఘోరంగా ఉందంటే.. రోజుకు 1.6 సిగరెట్లు తాగడంతో సమానంగా ఉందన్నారు.

ఈ కలుషితమైన గాలి కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం 40 నుంచి 50శాతం ఉందన్నారు. లంగ్ క్యాన్సర్ బారిన పడే రిస్క్ 3 రెట్లు అధికంగా ఉందన్నారు. తొందరగానే చనిపోయే రిస్క్ కూడా ఎక్కువగా ఉందన్నారు. బాబా రాందేవ్ గుర్రంతో పరుగు పందెం వీడియోని ఉద్దేశించి తాను ఇలా పోస్ట్ పెట్టగానే.. రాందేవ్ బాబా తన పోస్ట్ ని హైడ్ చేయడమే కాకుండా తనను బ్లాక్ చేశారని జాన్సన్ ఆరోపిస్తున్నారు.