రోడ్ షో, ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల్లోనూ వీరు మాట్లాడకూడదు. ప్రచారానికి సంబంధించిన నోటి నుంచి మాటలు రాకూడదు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల
ఎన్నికల ప్రచారంలో మతతత్వ వ్యాఖ్యలు చేసిన నేతలపై ఈసీ సీరియస్ అయ్యింది. యూపీ సీఎం యోగి, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై ఆంక్షలు విధించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కంప్లయింట్స్ రావడంతో ఈసీ వేటు వేసింది. ఆర్టికల్ 324 కింద ఈ చర్యలు తీసుకుంది.
Read Also : సల్మాన్, అమీర్ ఖాన్ ఏకం అవ్వాలి, ఎన్నికలు రద్దు చెయ్యాలి : పాల్ డిమాండ్
సీఎం యోగి 72 గంటల ప్రచారంపై నిషేధం విధించిన ఎన్నికల సంఘం.. బీఎస్పీ మాయావతిపైనా అలాంటి తరహాలోనే ఆంక్షలు పెట్టింది. దేశవ్యాప్తంగా మాయావతి 48 గంటలు ప్రచారం చేయొద్దని ఆర్డర్స్ జారీ చేసింది ఈసీ. రోడ్ షో, ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల్లోనూ వీరు మాట్లాడకూడదు. ప్రచారానికి సంబంధించిన నోటి నుంచి మాటలు రాకూడదు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది ఈసీ.
Read Also : ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం సీరియస్
బీజేపీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత్రిపై ఈసీ ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇదే అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ నేతలు మతపరమైన కామెంట్లు చేశారు. జై ఆలీ.. భజరంగ్ ఆలీ అంటూ యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టారు. ఏప్రిల్ 10వ తేదీ మీరట్‌లో కూడా మతపరమైన వ్యాఖ్యలు చేశారు సీఎం యోగి. ఏప్రిల్ 07 వేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారామె.
వీటిపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీం ఆదేశించింది. ఈసీ ఎదుట ఇంకా ఎన్నో కంప్లయింట్స్ ఉన్నాయి. ఎన్నికల లోపు వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈసీ చర్యలకు దిగింది. యోగీ, మాయావతిల నోటికి తాళం వేసింది.
Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా