Yogi Adityanath : ఈ నెల 25నే యూపీ సీఎంగా యోగి ప్రమాణస్వీకారం.. ఎక్కడంటే?

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారోత్సవం మార్చి 21న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు యోగి ప్రమాణస్వీకారోత్సవం మార్చి 25కి మార్చారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. యూపీ సీఎంగా యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, వీఐపీలు, సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులు సైతం యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దాదాపు 45వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే 200 మంది వీవీఐపీల జాబితాను రెడీ చేసినట్టు తెలిసింది. మార్చి 25, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ స్టేడియంలో 50వేల మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగలదు. అంతేకాదు.. యోగి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యర్థి పార్టీలకు చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రతిపక్ష నేతలందరిని ఆహ్వానించనున్నట్టు సమాచారం. యూపీ రాజకీయాల్లో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఒక పార్టీ అధికారాన్ని చేపడుతోంది. అందులోనూ యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Yogi Adityanath To Take Oath As Up Chief Minister On March 25

యూపీ ఎన్నికల్లో 403 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ కూటమి 273 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ 255, అప్నాదళ్ (S) 12, నిషాద్ పార్టీ 6 సీట్లు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో 11 మంది బీజేపీ మంత్రులు పరాజయం పాలయ్యారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఉన్నారు. కౌశాంబిలోని సిరతు స్థానం నుంచి ఎస్పీకి చెందిన పల్లవి పటేల్ చేతిలో మౌర్య పరాజయం పాలయ్యారు. ప్రత్యర్థి పార్టీ ఎస్పీ కూటమి 125 సీట్లు మాత్రమే సాధించింది. ఎస్పీకి 111, ఆర్‌ఎల్‌డీకి 8, ఓం ప్రకాష్ రాజ్‌భర్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, రాజా భయ్యా పార్టీకి తలో రెండు సీట్లు వచ్చాయి. బీఎస్పీకి ఒక సీటుకు మాత్రమే పరిమితమైంది. 1987 తర్వాత దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన మొదటి ప్రభుత్వంగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఓటింగ్ జరిగాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరిగింది.

Read Also : Yogi Adityanath : ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి యూపీని కైవసం చేసుకున్నాం : యోగి ఆదిత్యనాథ్

ట్రెండింగ్ వార్తలు