Yogi Adityanath : ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి యూపీని కైవసం చేసుకున్నాం : యోగి ఆదిత్యనాథ్

2024లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రంతో మరింత ముందుకెళ్తామని చెప్పారు. యూపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.

Yogi Adityanath : ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి యూపీని కైవసం చేసుకున్నాం : యోగి ఆదిత్యనాథ్

Yogi

Yogi Adityanath : ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీయే విజయం సాధించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మరోసారి బీజేపీకి చారిత్రక విజయం అందించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి యూపీని కైవసం చేసుకున్నామని తెలిపారు. మోదీ పాలన చూసే ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు యోగీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాశక్తికి ఈ విజయం అద్దం పడుతోందన్నారు.

2024లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రంతో మరింత ముందుకెళ్తామని చెప్పారు. యూపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. సుపరిపాలన వల్లే 25 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం దక్కిందన్నారు. ఈవీఎంలు ట్యాంపర్ చేశారని కొందరు దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Uttar Pradesh 2022 : యూపీ నా అడ్డా అంటున్న యోగీ.. మెజార్టీకి 15 పాయింట్స్

యూపీలో బీజేపీ విజయదుందుభి మోగించింది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. అభివృద్ధి నినాదం బీజేపీని గెలిపించింది. యోగి పాలనకు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఫిదా అయ్యారు. నేరాలను అదుపు చేయడంలో యోగిని మహిళలు ఆదరించారు. సంక్షేమ పథకాలు, హిందుత్వ అంశం, రామాలయ నిర్మాణం, కాశీకారిడార్ అభివృద్ధి బీజేపికి కలిసివచ్చాయి.

యూపీలో బీజేపీ 266 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎస్పీ 132 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 2, బీఎస్ పీ 1, ఇతరులు రెండు స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. అలాగే మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలోనూ ఆధిక్యంలో ఉంది. కాగా, పంజాబ్ లో ఆప్ ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది.