మీ సొమ్ము సేఫ్…యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థికమంత్రి హామీ

యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర్మలా తెలిపారు. దీనిపై సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్బీఐ కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం,ఆర్బీఐ ఈ విషయంలో కలిసి పనిచేస్తాయన్నారు.

ఆర్బీఐతో కలిసి తాను చాలా కాలం నుంచి వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు,బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొనే చర్యలు తీసుకుంటామని నిర్మలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల సొమ్ము సేఫ్ గా ఉంటుందన్నారు. బ్యాంకు పునర్నిర్మాణానికి ఉన్న ప్రత్యామ్నాయాలన్నింటిపీ పరిశీలిస్తున్నామన్నారు. 

అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ… యస్ బ్యాంక్ కోలుకునేందుకు తమ దగ్గర ఓ స్కీమ్ ఉందన్నారు. వేగవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత ఆర్థిక,బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వం నెలకొనేలా చర్యలు ఉంటాయన్నారు. యస్ బ్యాంక్ ఖాతాదారులు నెలకు రూ50వేలు మాత్రులు విత్ డ్రా చేసుకునేలా గురువారం ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్-3,2020వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.

See Also | పెళ్లిలో దీదీ డ్యాన్స్ : ఫ్రైర్‌బ్రాండ్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు