గూగుల్ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube.. మరియు G-Mail అకస్మాత్తుగా డౌన్ అయిపోయాయి. ప్రపంచం నలుమూలల నుండి యూజర్లు యూట్యూబ్ మరియు GMail ఉపయోగించలేకపోతున్నారు.
దీనిపై ఇప్పటికే గూగుల్ కంపెనీకి సోషల్ మీడియాలోనూ.. మెయిల్స్ ద్వారా నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. గూగుల్‌కు సంబంధించిన ఈ రెండు సేవలు సోమవారం సాయంత్రం డౌన్ అయినట్లుగా తెలుస్తుంది. ‘గూగుల్ డౌన్’ అంటూ ట్విట్టర్‌లో ఈ మేరకు ట్రెండింగ్ ప్రారంభం అయ్యింది.